ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డులను ఎనిమిదింటిని గెలుచుకుని, వాణిజ్యపరంగానూ విజయవంతమైన సినిమా 'ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటీ' (1953). అమెరికాకు చెందిన పెర్ల్‌హార్బర్‌పై జపాన్ వైమానిక దాడి సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఓ సైనికుడి కథ ఇది.
అమెరికా రచయిత జేమ్స్ జోన్స్ రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా ఓ గొప్ప భావోద్వేగ భరితమైన చిత్రంగా పేరు తెచ్చుకుంది. అప్పట్లో దాదాపు 2.5 మిలియన్ డాలర్ల వ్యయంతో చిత్రీకరించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 30.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
పదమూడు ఆస్కార్ నామినేషన్లు పొంది, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం సహా ఎనిమిది అవార్డులను అందుకుంది. నాలుగు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఫ్రెడ్ జిన్నెమాన్ దీనికి దర్శకుడు. ఈ సినిమాను అమెరికా జాతీయ చలనచిత్ర రిజిస్ట్రీలో భద్రపరిచారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. 'సాహో'లో బాక్సర్‌గా డార్లింగ్ ప్రభాస్..?