ETV Bharat / sitara

కరోనాను ఫుట్​బాల్​లా కిక్ చేసిన అమితాబ్! - Amitabh Bachchan latest news

కరోనాను జయించిన మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్.. తన తండ్రి హరివంశ్​ రాయ్​ బచ్చన్​ కవితలను సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ​

Free from COVID-19, Amitabh Bachchan shares inspiring poems by his father
కవితలతో స్ఫూర్తిని పంచుతున్న బిగ్​బీ
author img

By

Published : Aug 6, 2020, 9:22 AM IST

దాదాపు మూడువారాల పాటు కరోనాతో పోరాడిన బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఇటీవలే కోలుకున్నారు. ముంబయిలోని నానావతి ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇన్​స్టా వేదికగా కొన్ని కవితల్ని పోస్ట్ చేశారు. దీనితోపాటే కరోనా వైరస్​ను ఫుట్​బాల్​లా తన్నిత ఫొటోను పంచుకున్నారు.

తన తండ్రి హరివంశ్​ రాయ్​ బచ్చన్​ రాసిన 'అకెలెపాన్​ కా బాల్​', 'అగ్నిపత్​', 'ధనుష్​ ఉతా ప్రహార్​ కర్​' కవితలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు బిగ్​బీ. వీటికి నెటిజన్ల నుంచి విశేషాదరణ లభిస్తోంది.

జులై 11న అమితాబ్​, అభిషేక్ కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత జరిపిన పరీక్షల్లో బిగ్​బీ కోడలు ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్యలకు వైరస్​ సోకినట్లు తేలింది. వీరిద్దరూ త్వరగానే కోలుకున్నారు. ఇటీవలే అమితాబ్ మహమ్మారి నుంచి కోలుకోగా.. అభిషేక్ మాత్రం ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.