ఫ్రెడ్డీ మెర్క్యూరీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంగీత దిగ్గజం. రాక్ మ్యూజిక్ చరిత్రలో గొప్ప సింగర్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 70, 80వ దశకాల్లో సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫ్రెడ్డీ భారత సంతతికి చెందిన వ్యక్తి అని ఎంతమందికి తెలుసు? ఆయన బాల్యం ముంబయిలోనే గడిచింది. నేడు ఫ్రెడ్డీ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై ఓ లుక్కేద్దాం!
భారత తొలి రాక్‌స్టార్..
ఫ్రెడ్డీ మెర్క్యూరీ అసలు పేరు ఫరూఖ్ బల్సారా. భారత్‌కు చెందిన పార్శీ దంపతులు బోమి బల్సారా, జెర్ బల్సారాకు బ్రిటీష్ అధీనంలోని జాంజిబార్‌లో జన్మించాడు. ముంబయిలోని సెయింట్ పీటర్,సెయింట్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నాడు. ఇక్కడే అతడి పేరును ఫ్రెడ్డీగా మార్చుకున్నాడు. స్కూల్లో ఉండగానే తన స్నేహితులతో కలిసి 'ద హెక్టిక్స్' అనే బ్యాండ్ ఏర్పాడు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆల్బమ్‌లతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్..
అనంతరం 1970 లండన్‌లో నలుగురితో కలిసి 'క్వీన్' అనే రాక్ బ్యాండ్ ఏర్పాటు చేశాడు. ఈ బ్యాండ్ ద్వారా మర్చిపోలేని ఎన్నో పాటలకు ప్రాణం పోశాడు. 'కిల్లర్ క్వీన్, బొహిమియన్ రాప్సోడీ, సమ్‌బడీ టు లవ్, వీ ఆర్ ద ఛాంపియన్స్, డోన్ట్ స్టాప్ మీ నౌ, క్రేజీ లిటిల్ థింగ్ కాల్డ్ లవ్' లాంటి ఆల్బమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అత్యధిక మంది పాల్గొన్న లైవ్ షో..
ప్రపంచదేశాల్లో ఎన్నో లైవ్ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించాడు ఫ్రెడ్డీ. 1985లో ఇచ్చిన లైవ్ ఎయిడ్ ఆయన ప్రదర్శనల్లో ఎప్పటికీ గుర్తుండి పోతుంది. లండన్, అమెరికా రెండు చోట్ల నిర్వహించిన ఈ ప్రదర్శనకు అత్యధిక మంది హాజరయ్యారు. లండన్ లైవ్ షోకు 72 వేలు మంది రాగా.. యూఎస్‌లో లక్షమంది పాల్గొన్నారు. ఇప్పటికీ ఇదే రికార్డు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బయోపిక్కు ఆస్కార్ల పంట..
ఫ్రెడ్డీ మెర్క్యూరీ జీవితం ఆధారంగా 2018లో బొహిమియన్ రాప్సోడీ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాలో ఫ్రెడ్డీ పాత్రను పోషించిన రమీ మాలెక్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. మొత్తం ఈ చిత్రానికి 4 అకాడమీ పురస్కారాలు వచ్చాయి. ఫ్రెడ్డీ రూపొందించిన ఆల్బమ్ పేరు మీద ఈ సినిమా తీశారు. ఈ ఆల్బమ్ యూకేలో ఎక్కువ మంది కొనుగోలు చేసిన వాటిలో మూడోది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హెచ్ఐవీతో మరణం...
1986 హెచ్ఐవీ బారిన పడిన ఫ్రెడ్డీ మెర్క్యూరీ మొదట ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అనంతరం 1987లో ఆయన స్నేహితురాలి ద్వారా ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. 1991 నవంబరు 24న నిమోనియాతో 45 ఏళ్ల వయసులోనే మరణించాడు.
ఇది చదవండి: భాగ్యనగరంలో బొద్దుగా కనిపించిన బొమ్మాళీ