ETV Bharat / sitara

ట్రాన్స్​జెండర్లు చెప్పిన కథే ఈ సినిమా: లారెన్స్ - అక్షయ్ కుమార్ లారెన్స్ లక్ష్మీ బాంబ్

'లక్ష్మీ బాంబ్' సినిమాకు మూలకథ ఎక్కడి నుంచి వచ్చిందో దర్శకుడు లారెన్స్ తెలిపారు. గతంలో ట్రాన్స్​జెండర్ల కథలు విన్న తర్వాత 'కాంచన' చిత్రం చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. దాని హిందీ రీమేక్​ 'లక్ష్మీ బాంబ్'.

Felt compelled to tell the story of the transgender community: Laxmmi Bomb director
లక్ష్మీ బాంబ్ సినిమా లారెన్స్
author img

By

Published : Oct 18, 2020, 12:07 PM IST

అగ్ర కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ 'లక్ష్మీ బాంబ్‌' సినిమాలోని పాత్రకు సంతకం చేయడం గొప్ప విషయమని దర్శకుడు రాఘవా లారెన్స్‌ అన్నారు. తమిళంలో తీసిన 'ముని 2: కాంచన'కు హిందీ రీమేక్‌ ఇది. కియారా అడ్వాణీ కథానాయిక. ఓటీటీ వేదికగా నవంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో తన సహాయం కోసం వచ్చిన ట్రాన్స్‌జండర్ల కథలు విన్న తర్వాతే 'కాంచన' సినిమా తీయాలనే ఆలోచన వచ్చినట్లు దర్శకుడు లారెన్స్ వివరించారు.

'తమిళంలో ఈ చిత్రం 'కాంచన'గా విడుదలైంది. 'కాంచన' అంటే బంగారం అని అర్థం. లక్ష్మికి మరో రూపం. కాబట్టి 'లక్ష్మి' టైటిల్‌ పెట్టాలని అనుకున్నాను. దానికి తోడు సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. అందరం కలిసి 'లక్ష్మీ బాంబ్‌' టైటిల్‌ను నిర్ణయించాం. హిందీ ప్రేక్షకులకు చేరువ కావడానికి ఇది మంచి టైటిల్‌. ఇందులో ట్రాన్స్‌జండర్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అదే ఈ సినిమాలో కీలకం. 'లక్ష్మీ బాంబ్‌' థ్రిల్‌తోపాటు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. హారర్‌-కామెడీతో పాటే ప్రజలకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. స్క్రీన్‌పై ఒకే పాత్రలోని విభిన్న కోణాల్ని అందరూ ఎంజాయ్‌ చేస్తారు'

'నేను ఓ ట్రస్ట్‌ నడుపుతున్నా. కొన్నేళ్ల క్రితం కొందరు ట్రాన్స్‌జండర్లు సాయం కోసం నన్ను కలిశారు. ఆ సమయంలో వారి జీవితం గురించి తెలుసుకున్న తర్వాత.. వారి కథను 'కాంచన' అనే పాత్రతో అందరికీ తెలియజేయాలి అనుకున్నా. 'లక్ష్మీ బాంబ్‌' సినిమా చూసిన తర్వాత హిందీ ప్రేక్షకులకు ఆ విషయం అర్థమవుతుంది'

"కాంచన' సినిమా తమిళంలో విడుదలైన తర్వాత విశేషమైన స్పందన వచ్చింది. ప్రత్యేకించి ట్రాన్స్‌జండర్లు ఎంతో ప్రశంసించారు. నేరుగా నా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించారు. హిందీలో అలాంటి పాత్రలో అక్షయ్‌ కుమార్‌ సర్‌ నటిస్తే.. ఈ సందేశం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చేరుతుందని భావించా. ఈ చిత్రానికి అంగీకరించి, నటించినందుకు అక్షయ్‌ సర్‌కు ధన్యవాదాలు చెబుతున్నా' అని లారెన్స్‌ పేర్కొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.