ETV Bharat / sitara

జాన్వీ కపూర్​ సినిమాకు రైతు నిరసనల సెగ - జాన్వీ కపూర్ చిత్రీకరణ అడ్డగింత

నటి జాన్వీ కపూర్​ కొత్త సినిమా షూటింగ్​ను పంజాబ్​లో రైతులు అడ్డగించారు. తమ ఆందోళనలకు మద్దతు ఇస్తేనే చిత్రీకరణ కొనసాగుతుందని చెప్పారు.

farmers demands good luck jerry crew to support their protest
జాన్వీ కపూర్​ సినిమాకు రైతు నిరసనల సెగ
author img

By

Published : Jan 13, 2021, 2:50 PM IST

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్​కు పంజాబ్​లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటిస్తున్న 'గుడ్​లక్​ జెర్రీ' షూటింగ్​ను కొందరు రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే చిత్రీకరణ జరపడానికి వీలులేదని హెచ్చరించారు.

janvi kapoor
జాన్వీ కపూర్​

తమ డిమాండ్​కు యూనిట్ అంగీకారం తెలపడం వల్ల రైతులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల ఎదుటే జరిగిందని ఓ వార్త సంస్థ తెలిపింది. ఈ సంఘటన తర్వాత రైతులకు మద్దతుగా ఇన్​స్టాలో జాన్వీ కపూర్​ ఓ పోస్టు పెట్టింది.

'గుడ్​లక్​ జెర్రీ' షూటింగ్​ పంజాబ్​లో జనవరి 11న ప్రారంభమైంది. మార్చి వరకు ఈ షెడ్యూల్​ జరగనుంది. ఈ సందర్భంగా విడుదలైన ఫస్ట్​లుక్​ ఆకట్టుకుంటోంది. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: షారుక్​ పాటకు జాన్వీ బెల్లీడాన్స్​.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.