Paruchuri Venkateswarao latest photo: తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా కథల్ని, మాటల్ని కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఈ సోదరులది. రచయితలకి స్టార్ హోదా దక్కిందంటే దానికి వీరు ఓ కారణమని చెప్పవచ్చు. పరుచూరి ద్వయంలో అగ్రజుడైన పరుచూరి వెంకటేశ్వరరావు కేవలం రచయితగానే కాకుండా.. దర్శకుడిగా, నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అది చూసిన సినీప్రియులంతా ఆందోళనకు గురౌతున్నారు.
దర్శకుడు జయంత్ సి పరాన్జీ.. పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలలో పరుచూరి వెంకటేశ్వరరావుని చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆయన రూపం ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ ఫొటో చూస్తుంటే ఆయన వృద్ధాప్య దశకు చేరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
కాగా, పరుచూరి బ్రదర్స్.. తెలుగు చిత్ర సీమలో 350కి పైగా చిత్రాలకు కథలు, మాటలు అందించారు. పరుచూరి గోపాలకృష్ణ.. ప్రస్తుతం 'పరుచూరి పలుకులు' పేరుతో యూట్యూబ్ వేదికగా తన అనుభవాలు పంచుకుంటున్నారు.
ఇదీ చూడండి: నటుడు విశాల్‌కు షాకిచ్చిన మద్రాసు హైకోర్టు!