ఇద్దరు పవర్‌స్టార్ అభిమానులు పవన్‌కల్యాణ్‌కు పుట్టిన రోజు కానుక అందజేశారు. అదేంటి పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న కదా..! ఇప్పుడు కానుక ఇవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా..? అవును.. ఇప్పుడే ఇచ్చారు. దానికి ఓ కారణం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనిల్, భాను.. పవన్‌కు వీరాభిమానులు. అందుకే తమ అభిమాన హీరో పవర్‌స్టార్ చిత్రం గీసి ఆయన పుట్టిన రోజున కానుకగా ఇద్దామని అనుకున్నారు. కరోనా వల్ల ఆయనను కలవడం కుదరలేదు.
![pawan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9998784_514_9998784_1608858744821.png)
తాజాగా ఆయనను కలిసే అవకాశం వచ్చింది. దీంతో అప్పుడు ఇద్దామనుకున్న చిత్రపటాన్ని ఇప్పుడు ఆయనకు అందజేశారు. పవన్‌కల్యాణ్ రాజకీయ పార్టీ జనసేనను ఉద్దేశిస్తూ.. 'పదం శబ్దం చేస్తే.. నిశ్శబ్దం మాట్లాడుతుంది' అని రాసి.. చివర్లో 'హ్యాపీ బర్త్‌డే' అని రాసుకొచ్చారు. వాళ్లిద్దరూ కిక్, గోపాల గోపాల, అజ్ఞాతవాసి, ఎంసీఏ సినిమాలకు పబ్లిసిటీ కంటెంట్ డిజైనర్లుగా పనిచేశారు. ఈ చిత్రపటం పవన్ కల్యాణ్‌కు అందించేందుకు మూడు నెలలు ఎదురుచూడాల్సి వచ్చిందని వాళ్లు చెప్పారు.
కాగా, పవన్‌కల్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక. ప్రకాశ్‌రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాతో పాటు పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్.
ఇదీ చూడండి : పవన్ కల్యాణ్‌కు హ్యాండిచ్చిన శృతిహాసన్!