ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జాన్ సింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలోని జండియాలా గురు వద్ద మంగళవారం ఉదయం ఆయన కారు అదుపుతప్పి ట్రక్కును ఢీ కొట్టింది.
తీవ్ర గాయలైన దిల్జాన్ను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సింగర్ దిల్జాన్ మృతి పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.
దిల్జాన్ పాడిన ఓ పాట ఏప్రిల్ 2 విడుదల కానుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కారులో బయల్దేరిన గాయకుడు.. ఈ ప్రమాదంలో మరణించారు.
ఇదీ చూడండి: అమితాబ్ 'చెహ్రే' విడుదల తేదీ వాయిదా