ETV Bharat / sitara

'ఎఫ్​ 3' షూటింగ్​ రీ-స్టార్ట్​.. 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' థీమ్ ​

author img

By

Published : Jul 2, 2021, 7:45 PM IST

టాలీవుడ్​లో కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'ఎఫ్​ 3' షూటింగ్​ పునఃప్రారంభం సహా 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' థీమ్​ సాంగ్​, 'ఇందువదన' లిరికల్​ సాంగ్​ ప్రోమో, 'లవ్​స్టోరి' మూవీ సాంగ్​ వ్యూస్​, తమిళ చిత్రం 'మహ' టీజర్​ అప్​డేట్లు ఇందులో ఉన్నాయి.

F3 Movie Shooting Resume - WWW Telugu Movie Theme Released
'ఎఫ్​ 3' షూటింగ్​ అప్​డేట్​.. 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' థీమ్ మ్యూజిక్​​

తెలుగు, తమిళ భాషల్లో రానున్న తొలి కంప్యూటర్‌ స్క్రీన్​ చిత్రం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' (ఎవరు ఎక్కడ ఎందుకు). '118' సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్న కె.వి. గుహన్‌ తెరకెక్కిస్తోన్న రెండో చిత్రమిది. అదిత్‌ అరుణ్‌, శివానీ రాజశేఖర్‌ నాయకానాయికలుగా నటిస్తున్నారు. రవి ప్రసాద్‌ రాజు దాట్ల నిర్మాత. మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో రానున్న ఈ సినిమా థీమ్‌ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. కథానాయకుడు, నటులు ప్రియదర్శి, సత్యం రాజేశ్‌ తదితరులు ఆన్‌లైన్‌ వేదికగా ముచ్చటించడం, హర్ష కిడ్నాప్‌ గురయ్యే సన్నివేశాలతో ఆసక్తిగా సాగింది ఈ వీడియో. మరి ఎక్కడ, ఎవరి మధ్య ఏం జరిగింది? ఎందుకు జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రామంత్ర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఇందువదన' లిరికల్​ ప్రోమో..

కొన్నేళ్ల విరామం తర్వాత వరుణ్ సందేశ్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. 'ఇందువదన' టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్​లుక్​ను ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్. ఇందులోని తొలి లిరికల్​ సాంగ్​ 'వాడి వేడిగా'ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం రిలీజ్​ చేసింది. ఇప్పటివరకు కనిపించని కొత్త గెటప్​లో వరుణ్ దర్శనమిచ్చారు. అభిలాష్ దర్శకత్వం వహిస్తుండగా, మాధవి నిర్మిస్తున్నారు.

20 మిలియన్​ వ్యూస్​

శేఖర్​ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్​స్టోరి'. సునీల్​ నారంగ్​ నిర్మాతగా వ్యవహరించగా.. పవన్​ సీహెచ్​ స్వరాలను సమకూర్చారు. ఈ సినిమాలోని 'సారంగదరియా' పాట యూట్యూబ్​లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుండగా.. ఇప్పుడు అందులోని మరో పాట 'నీ చిత్రం చూసినా..' సాంగ్​కు యూట్యూబ్​లో 20 మిలియన్ల వ్యూస్​ లభించాయి. అయితే ఏప్రిల్​ 16న ఈ చిత్రం విడుదలకావాల్సి ఉండగా.. కరోనా సంక్షోభం కారణంగా అదికాస్త వాయిదా పడింది. కొత్త రిలీజ్​ డేట్​ను త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాత ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'ఎఫ్​ 3' షూటింగ్​ అప్​డేట్​

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'ఎఫ్‌3'(F3 movie) ఒకటి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌(Venkatesh), వరుణ్‌తేజ్‌(Varun Tej) కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా(Tammanah), మెహరీన్‌(Mehreen) కథానాయికలు. గతంలో వచ్చిన 'ఎఫ్‌2'కు కొనసాగింపుగా ఈ సినిమా రాబోతుంది. కరోనా కారణంగా మార్చిలో షూటింగ్​ ఆగిపోగా.. ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం రెండు ఫొటోలను షేర్​ చేసింది.

'మహ' టీజర్​

​శింబు, హన్సిక హీరోహీరోయిన్లుగా కలిసి నటిస్తోన్న తమిళ చిత్రం 'మహ'. యు.ఆర్​.జమీల్​ దర్శకత్వం వహిస్తుండగా.. వి.మతియలాగన్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హన్సిక కెరీర్​లో 50వ చిత్రమిది. ఈ సినిమా టీజర్​ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది.

ఇదీ చూడండి.. F3 Movie: ప్రత్యేక గీతంలో ప్రగ్యా జైశ్వాల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.