నటి రోజా, సింగర్ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో 'ఎక్స్ట్రా జబర్దస్త్'. రష్మి వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో ఎంతగానో మెప్పిస్తోంది.
సుడిగాలి సుధీర్ స్కిట్లో ఆటో పంచ్‌లు.. బుల్లెట్ భాస్కర్ స్కిట్లో నరేశ్ కామెడీతో పాటు రాకేశ్ మాస్టర్ స్పెషల్ అప్పీరియన్స్ అలరించనుంది. రాకేశ్ మాస్టర్, నరేశ్ కలిసి వేసిన డ్యాన్స్ కడుపబ్బా నవ్వించింది. కెవ్వు కార్తిక్ టీమ్‌లో వర్ష, ఇమ్మాన్యుయెల్ జోడీ తన మార్క్ కామెడీతో అలరించింది. రాకింగ్ రాకేశ్, రోహిణి తమ పంచులతో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. అంతకుముందు ఈ ఫన్నీ ప్రోమోనూ మీరూ చూసేయండి.
ఇదీ చూడండి: 'జబర్దస్త్' అదిరే అభి అంత పిసినారా?