కల్యాణ్ దేవ్, రచితా రామ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సూపర్ మచ్చి'. పులి వాసు దర్శకుడు. రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. దీనిలో భాగంగా కల్యాణ్ దేవ్, రాజేంద్రప్రసాద్‌లపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. తమన్ బాణీలందించిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యమివ్వగా.. ఆనీ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. "చక్కటి ప్రేమకథతో నిండిన కుటుంబ కథా చిత్రమిది. కల్యాణ్ దేవ్ పాత్ర ఇటు కుటుంబ ప్రేక్షకుల్ని, అటు మాస్ ప్రేక్షకుల్నీ అలరించేలా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్, నరేశ్ పంచే వినోదం అమితంగా ఆకట్టుకుంటుంది. తమన్ ఇచ్చిన ఐదు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటతో పాటు మరో గీతాన్ని చిత్రీరించాల్సి ఉంది" అన్నారు. ఈ చిత్రానికి కళ: బ్రహ్మ కడలి, కూర్పు: మార్తండ్ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు.