ETV Bharat / sitara

Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్​ షోలో మహేశ్​..​ ఎంట్రీ అదిరిందిగా! - మీలో ఎవరు కోటీశ్వరులు మహేశ్​బాబు ప్రోమో

Evaru meelo koteeswarulu maheshbabu: ఎన్టీఆర్​ వ్యాఖ్యాతగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న రియాల్టీ గేమ్​ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'లో సూపర్​స్టార్ మహేశ్​బాబు సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.

Evaru Meelo Koteeswarulu mahesh babu promo, ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో
మహేశ్​
author img

By

Published : Nov 23, 2021, 3:11 PM IST

Updated : Nov 23, 2021, 3:16 PM IST

Evaru meelo koteeswarulu maheshbabu: ఒకరు సూపర్‌స్టార్‌.. మరొకరు యంగ్‌ టైగర్‌.. ఈ ఇద్దరూ స్టార్‌ హీరోల సరదా మాటలకు వేదికైంది 'ఎవరు మీలో కోటీశ్వరులు' (Evaru Meelo Koteeswarulu NTR). యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్‌ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'. మధ్యతరగతి వారి కలలను సాకారం చేయడం సహా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ గేమ్‌ షోలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సందడి చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదలై ఆకట్టుకుంటోంది(evaru meelo koteeswarudu latest promo).

ఈ ప్రోమోలో 'వెల్​కమ్​ మహేశ్​ అన్న' అంటూ తారక్​ మహేశ్​ను ఆహ్వానించగా.. 'అదిరిపోయింది' అని సూపర్​స్టార్​ బదులిచ్చారు. అనంతరం 'నా రాజా' అంటూ ఎన్టీఆర్​ తనదైన మేనరిజంతో జోష్​ నింపారు. ఆ తర్వాత 'కరెక్ట్​ ఆన్సర్​నే అటూ ఇటూ ఎందుకు తిప్పుతారు' అని మహేశ్​ అడగగా.. 'సరదా కోసం' అని ఎన్టీఆర్​ సమాధానమిచ్చారు. 'గురువుగారే బెటర్​గా ఉన్నారు నీకన్నా' అన్న మహేశ్​ మాటలు నవ్వులు పూయించాయి. మొత్తంగా వీరిద్దరి సంభాషణ సరదా సరదాగా సాగింది. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ కోసం అటు ఎన్టీఆర్‌ అభిమానులు, ఇటు మహేశ్‌బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకూ ప్రోమో చూసి ఆనందించండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అంతకుముందు ఈ షోకు రామ్​చరణ్​, సమంత, రాజమౌళి, కొరటాలశివ అతిథులుగా వచ్చి ప్రేక్షకులను అలరించారు.

ఇదీ చూడండి: 'ద్రవిడ్ నా ఫస్ట్​ లవ్.. అతడి కోసం మళ్లీ..'

Last Updated : Nov 23, 2021, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.