ETV Bharat / sitara

అభిషేకానికి 'శుభం'.. గీతగోవిందానికి 'స్వాగతం'

Abhishekam Serial: తెలుగు ప్రేక్షకుల మనసును హత్తుకున్న 'అభిషేకం' సీరియల్​ ఈ రోజుతో(మంగళవారం) పూర్తికానుంది. ఈ ధారావాహిక, నిరాటంకంగా ప్రసారమవుతూ సరిగ్గా 4000 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం విశేషం. కాగా, ఎన్నో ఆణిముత్యాల్లాంటి సీరియల్స్‌ను అందించిన ఈటీవీ 'గీతగోవిందం' పేరుతో మరో కొత్త ధారావాహికను మీ ముందుకు తీసుకు రానుంది.

author img

By

Published : Feb 1, 2022, 6:41 AM IST

abhisheka serial
అభిషేకం సీరియల్​

Abhishekam Serial: తెలుగు టెలివిజన్‌ చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయం సృష్టించిన ధారావాహిక 'అభిషేకం'. ఈటీవీలో 14 సంవత్సరాల క్రితం.. 2008 డిసెంబరు 22న ప్రారంభమైన ఈ డైలీ సిరీయల్‌, నిరాటంకంగా ప్రసారమవుతూ సరిగ్గా 4000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని ఈ రోజే ముగుస్తోంది.

ఇప్పటి వరకు మరే తెలుగు సీరియల్‌ సాధించలేని ఈ ఘనతను 'అభిషేకం' సొంతం చేసుకుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు తానే స్వయంగా కథ అందించి, తన పర్యవేక్షణలో ప్రారంభించిన ఈ సీరియల్‌కు ఆయన సతీమణి దాసరి పద్మ నిర్మాతగా వ్యవహరించారు. ‘సౌభాగ్య మీడియా’ పతాకంపై నిర్మించిన ఈ సీరియల్‌ అచ్చ తెలుగు కథతో అశేష తెలుగు ప్రేక్షకలోకాన్ని ఆకర్షించింది. ఎన్ని ఛానళ్లలో ఎన్ని సీరియల్స్‌ మారుతున్నా ఈటీవీలో ప్రతి మధ్యాహ్నం 2 గంటలకు మాత్రం 'అభిషేకం' అప్రతిహతంగా సాగిపోతూనే వచ్చింది. ఈ ప్రయాణంలో ఎన్నో అవార్డులు - రివార్డులు సొంతం చేసుకుంది. శ్రీహరి, జయసుధ, మురళీమోహన్‌, వైజాగ్‌ ప్రసాద్‌ తదితర ప్రముఖులెందరో ఈ ధారావాహికలో నటించారు. నిర్మాణ బాధ్యతల్ని తాండవ కృష్ణ నిర్వహించారు. ఇంతటి ప్రజాదరణ పొందిన అభిషేకం సీరియల్‌ చివరి ఎపిసోడ్‌ ఈ రోజు(మంగళవారం) మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారం కానుంది.

ఫిబ్రవరి 2, బుధవారం నుంచి ప్రతిరోజూ మధ్నాహ్నం 2 గంటలకు

ఎన్నో ఆణిముత్యాల్లాంటి సీరియల్స్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఈటీవీ, సరికొత్తగా సమర్పిస్తోన్న ధారావాహిక- గీతాగోవిందం, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సీరియల్‌, రెండు భిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు అగ్నిసాక్షిగా ఒకటైతే.. ఆ బంధమే వారికి అగ్ని పరీక్షగా మారితే..అనే అంశాన్ని అడుగడుగునా ఉత్సుకత కలిగించే రీతిలో తెరకెక్కించనుంది.

తల్లిలేని పిల్ల గీత..చదువంటే ప్రాణం. అసలు చదువు అనే మాట వింటేనే భగ్గుమనే ముక్కోటమ్మ ఇంటికి కోడలుగా అనుకోని పరిస్థితుల్లో అడుగుపెడుతుంది గీత. మొరటువాడైన భర్తని భరిస్తూ ఆ ఇంట గీత ఎదుర్కొన్న సవాళ్లేమిటి? ఓర్పుకి, సహనానికి మారుపేరైన మహిళా లోకానికి ప్రతినిధిగా గీత ఎంచుకున్న మార్గమేమిటి? ప్రతి రోజూ, ప్రతి సన్నివేశం మనసుని కట్టిపడేసేలా తీర్చిదిద్దిన గీతగోవిందం సీరియల్‌లో కథానాయికగా ‘అంతర’, నాయకుడి పాత్రలో రాఘవ ప్రతాప్‌, ముక్కోటమ్మగా ప్రముఖ నటీమణి విచిత్ర నటించారు. రవి కొలకపూడి స్క్రీన్‌ప్లే అందించగా, బాలాజీ కృష్ణ దర్శకత్వం వహించారు.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

'ఆర్​ఆర్​ఆర్', 'ఆచార్య'​, 'భీమ్లా నాయక్​', 'సర్కారు వారి పాట' రిలీజ్​ డేట్స్​

రెచ్చగొడుతున్న బిగ్​బాస్ బ్యూటీ అందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.