ETV Bharat / sitara

'ఈశ్వర' సాంగ్ ప్రోమో.. 'టక్ జగదీష్' సాంగ్ అప్​డేట్ - టక్ జగదీశ్ కోలో కోలన్న కోలో సాంగ్

నేచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్'​లోని మరో పాట విడుదలకు ముహూర్తం కుదిరింది. అలాగే 'మోసగాళ్లు' కొత్త పోస్టర్ విడుదలైంది.

Eswara song promo and Tuck Jagadish song update
ఈశ్వర సాంగ్ ప్రోమో
author img

By

Published : Mar 11, 2021, 12:26 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్​టైనర్ 'టక్ జగదీష్'. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రంలోని ఓ సాంగ్ ఆకట్టుకోగా.. మరో పాటను విడుదల చేసేందుకు సిద్దమైంది చిత్రబృందం. 'కోలో కోలన్న కోలో' అంటూ సాగే పాటను మార్చి 13న ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Tuck Jagadish song update
టక్ జగదీష్

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'మోసగాళ్లు'. అమెరికాలో జరిగిన భారీ ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా మహా శివరాత్రి పురస్కరించుకుని ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

mosagallu
మోసగాళ్ళు

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన 'ఉప్పెన' మూవీలోని 'ఈశ్వర' పాట ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. తాజాగా కృతిశెట్టి ఈ పాటకు నాట్యరూపం ఇచ్చింది. మహా శివరాత్రి సందర్భంగా ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. పూర్తి సాంగ్ సాయంత్రం 4.05 గంటలకు విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.