'మాస్టర్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు తమిళ హీరో విజయ్. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్ చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది. ఈరోజు(బుధవారం) రెండో లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు.
ఈ పోస్టర్లో నలుపు టీషర్ట్స్ ధరించిన పిల్లల సమూహం కనిపిస్తుంది. వారంతా ముందుకు నడుస్తున్నట్లు ఉండగా, వారి మధ్యలో నిలబడి వెనక్కి తిరిగి, నోటిపై వేలు పెట్టుకొని సైలెన్స్ అనే సంజ్ఞ చేస్తున్నాడు విజయ్.
ఈ సినిమాకు 'ఖైదీ' ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో పోషిస్తున్నాడు. అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి.. సాయి పల్లవిని బెదిరిస్తోన్న హీరోయిన్ సమంత!