బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో అతడి ప్రేయసి రియా చక్రవర్తికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 7న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు లావాదేవీలు జరగడంపై అనుమానం వ్యక్తంచేసిన ఈడీ గత వారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆర్థిక లావాదేవీల అంశంపై ప్రధానంగా రియాను విచారించనున్నారు.
అలాగే, ఈ వ్యవహారంలో అనుమానిత వ్యక్తులందరికీ సమన్లు జారీచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, పట్నాలో తనపై దాఖలైన కేసు విచారణను ముంబయికి మార్చాలని అభ్యర్థిస్తూ రియా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. ఇరు వర్గాలు మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ కేసు విచారణను వారం పాటు వాయిదా వేసింది.