ETV Bharat / sitara

'ద రాక్' కుటుంబం మొత్తానికి కరోనా - హాలీవుడ్​లో కరోనా

తమ కుటుంబానికి కరోనా సోకిందని హాలీవుడ్ ప్రముఖ నటుడు డ్వేన్ జాన్సన్ వెల్లడించారు. మూడు వారాల క్రితం పాజిటివ్​ తేలిందని, ప్రస్తుతం దాని నుంచి కోలుకున్నామని తెలిపారు.

Dwayne 'The Rock' Johnson and his family test positive for COVID19
హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్
author img

By

Published : Sep 3, 2020, 10:24 AM IST

Updated : Sep 3, 2020, 11:19 AM IST

'ద రాక్'గా మనందరికి తెలిసిన డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ ప్రముఖ నటుడు డ్వేన్ జాన్సన్.. కొవిడ్ బారిన పడ్డారు. అతడితో పాటే కుటుంబంలోని భార్య, ఇద్దరు కుమార్తెలకు వైరస్​ సోకింది. ప్రస్తుతం అందరం కోలుకున్నామని, ఆరోగ్యంగానే ఉన్నట్లు చెబుతూ ఇన్​స్టాలో వీడియోను పోస్ట్ చేశారు.

90ల్లో డబ్ల్యూడబ్ల్యూఈలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్సన్.. 1998లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్​షిప్ గెల్చుకున్నారు. 1990-2000 మధ్య కాలంలో పలు రెజ్లింగ్ రికార్డులు సాధించారు. 'ద రాక్'గా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 2004 తర్వాత నటనపై దృష్టి సారించారు. 2011-13 మధ్యలో పార్ట్​టైమ్ రెజ్లర్​గానూ కొనసాగారు. గతేడాది పూర్తిస్థాయి కెరీర్​కు​ రిటైర్మెంట్​ పలికి పలు సినిమాల్లో కీలకపాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Dwayne 'The Rock' Johnson and his family
హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ కుటుంబం

జాన్సన్ నటించిన వాటిలో 'ద స్కార్పియన్ కింగ్'(2002), 'గేమ్ ప్లాన్'(2007), 'హెర్క్యూలస్'(2014), 'సాన్ ఆండ్రస్'(2015), 'రాంపేజ్'(2018) సినిమాలతో పాటు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్​లో ఐదు, ఆరు, ఏడు భాగాలు ఉన్నాయి. జుమాంజీ ఫ్రాంఛైజీలోనూ 'జుమాంజీ: వెల్​కమ్ టూ జంగిల్'(2017), 'జుమాంజీ: ద నెక్స్ట్​ లెవల్'(2019)ల్లో ప్రధాన పాత్రలు పోషించారు 'ద రాక్'.

Last Updated : Sep 3, 2020, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.