మలయాళంలో విజయవంతమైన 'దృశ్యం' తెలుగులోనూ అదే పేరుతో తెరకెక్కింది. ఇక్కడా ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మలయాళంలో 'దృశ్యం 2' సిద్ధమైంది. ఈ నెల 19న విడుదలవుతోంది. తెలుగులోనూ ఆ చిత్రం రీమక్‌కి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రెండో 'దృశ్యం' వెంకటేష్ కథానాయకుడిగానే తెరకెక్కబోతోంది.
సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. వెంకటేష్ ప్రస్తుతం 'ఎఫ్3'తో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం తర్వాత వెంకీ 'దృశ్యం 2' రీమేక్ కోసమే రంగంలోకి దిగుతారని సమాచారం. తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలోనూ వెంకటేష్ ఓ సినిమాకి పచ్చజెండా ఊపారు.