ETV Bharat / sitara

టామ్ క్రూజ్ అంతరిక్ష చిత్రానికి దర్శకుడు ఈయనే - Tom Cruise space movie director dug liman

అంతరిక్షంలో చిత్రీకరించనున్న హాలీవుడ్​ యాక్షన్​ హీరో టామ్​ క్రూజ్ సినిమాకు డగ్​ లిమాన్​ దర్శకత్వం వహించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో 'అమెరికన్​ మేడ్​', 'ఎడ్జ్​ ఆఫ్​ టుమారో' సినిమాలు వచ్చి ఘనవిజయం సాధించాయి.

tom cruise
టామ్​ క్రూజ్
author img

By

Published : May 27, 2020, 9:03 PM IST

హాలీవుడ్​ యాక్షన్​ హీరో టామ్​ క్రూజ్​.. తన తదుపరి సినిమా కోసం అంతరిక్షంలో సాహసాలు చేయనున్నాడని తెలియగానే సినీ ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ముఖ్యంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ విషయంపై ఉత్కంఠ వీడింది. ప్రముఖ దర్శకుడు డగ్​ లిమాన్​ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని స్పష్టత వచ్చింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో 'అమెరికన్​ మేడ్​', 'ఎడ్జ్​ ఆఫ్​ టుమారో' సినిమాలు వచ్చి ఘనవిజయం సాధించాయి

ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఇలాన్‌ మస్క్‌, అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' ఆధ్వర్యంలో ఈ చిత్రం రూపొందనుంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టగానే సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది.

'మిస్టర్​ అండ్​ మిసెస్​ స్మిత్'​, 'ది బౌర్న్​ ఐడెం​టిటీ' వంటి హిట్​ సినిమాలు తెరకెక్కించాడు దర్శకుడు డగ్​. ప్రస్తుతం 'చావోస్​ వాకింగ్​' సినిమా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.

57 ఏళ్ల టామ్.. ఇప్పటికే 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్​లో లెక్కలేనన్ని సాహసాలు చేసి, ప్రేక్షకులను విస్మయానికి గురిచేశాడు. బూర్జ్ ఖలీపాపై స్టంట్ సీన్, హెలికాప్టర్​ను పట్టుకుని వేలాడే సన్నివేశాలు లాంటివి ఇతడు చేసిన వాటిలో ఉన్నాయి. క్రూజ్ నటించిన 'టాప్​గన్: మేవ్​రిక్' విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం 'మిషన్ ఇంపాజిబుల్ 7' సినిమాలో నటిస్తున్నాడీ హీరో.

ఇదీ చూడండి : సినిమా కోసం అంతరిక్షంలో సాహసాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.