పూర్తిస్థాయి రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వస్తున్నారు?.. అగ్రకథానాయకుడు ఎన్టీఆర్కు గత కొన్నేళ్లుగా, పలు సందర్భాల్లో ఎదురవుతున్న ప్రశ్న. అయితే దీనిపై స్పష్టత ఇవ్వని తారక్.. మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని దాటవేస్తూ వస్తున్నారు.
అలా మొదలైంది..
2009 శాసనసభ ఎన్నికల సమయంలో జూ.ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారి ప్రచారం చేసి, పలు సభల్లో పాల్గొన్నారు. తనదైన ప్రసంగాలతో అదరగొట్టారు. కానీ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చారు.
విలేకర్లకు ఇటీవల ఆసక్తికర సమాధానాలు
ఇటీవల ఓ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రెస్మీట్లోనూ ఎన్టీఆర్కు ఇదే విషయమై ప్రశ్నలు ఎదురయ్యాయి. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? అని విలేకర్లు అడగ్గా.. 'ఈ ప్రశ్న మీరు చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. నేను చెప్పే సమాధానం ఏంటో మీకు తెలుసు. ఇది సమయం కాదు, సందర్భమూ కాదు. తర్వాత దాని గురించి తీరిగ్గా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం' అని తారక్ ఛలోక్తులు విసిరారు.
ఇది చదవండి: రాజకీయ ప్రవేశంపై జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారంటే?