బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌కు కరోనా వచ్చిందా? అని నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇందుకు ఆమె ట్వీట్ చేసిన ఓ వీడియో కారణంగా తెలుస్తోంది. ఇటీవలె లండన్ నుంచి వచ్చిందీ స్టార్ హీరోయిన్. ఆ తర్వాత ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంది. అయితే పోస్టు చేసిన వీడియోలో సోనమ్ కపూర్‌ను చూసిన అభిమానులు.. పేషంట్లా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చిందీ అందాల భామ.
తన ఫోన్ కెమెరాలో 'వివిధ్' ఫిల్టర్ ఆన్ అయ్యి ఉంటుందని ఓ నెటిజన్ చెప్పగా.. దానికి 'అవును' అని సమాధానమిచ్చింది సోనమ్.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్. ఈ సమయంలో ప్రయాణాలు చేయొద్దని.. పౌరులంతా స్వీయనిర్బంధం పాటించాలని కోరింది.
-
नमस्कार
— Sonam K Ahuja (@sonamakapoor) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
कोरोना वायरस के चलते मेरी आप सबसे अपील है कि अपने तथा दूसरों के बचाव के लिए कुछ चीजों का ध्यान रखें। जब तक बहुत आवश्यक ना हो, तब तक ट्रेन से गैर ज़रूरी यात्राएं ना करें। pic.twitter.com/LetBas52xp
">नमस्कार
— Sonam K Ahuja (@sonamakapoor) March 22, 2020
कोरोना वायरस के चलते मेरी आप सबसे अपील है कि अपने तथा दूसरों के बचाव के लिए कुछ चीजों का ध्यान रखें। जब तक बहुत आवश्यक ना हो, तब तक ट्रेन से गैर ज़रूरी यात्राएं ना करें। pic.twitter.com/LetBas52xpनमस्कार
— Sonam K Ahuja (@sonamakapoor) March 22, 2020
कोरोना वायरस के चलते मेरी आप सबसे अपील है कि अपने तथा दूसरों के बचाव के लिए कुछ चीजों का ध्यान रखें। जब तक बहुत आवश्यक ना हो, तब तक ट्रेन से गैर ज़रूरी यात्राएं ना करें। pic.twitter.com/LetBas52xp
ప్రస్తుతం కేంద్రం సహా ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడం వల్ల.. దేశవ్యాప్తంగా ప్రజారవాణా స్తంభించిపోయింది. మార్చి 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
" రైల్వేస్టేషన్లలో రద్దీ కారణంగా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప రైల్వే స్టేషన్లను సందర్శించ వద్దు. మీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి".
-- సోనమ్ కపూర్, కథానాయిక
భారత్‌లో కరోనా కేసులు 500లకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 492 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి.. మలయాళ రీమేక్‌లో నందమూరి బాలకృష్ణ!