DJ Tillu movie: సినిమాలోని సన్నివేశానికి, వాస్తవ జీవితానికి ముడిపెట్టి ప్రశ్నించిన ఓ జర్నలిస్టు తీరుపై యువ నటి నేహాశెట్టి అసహనం వ్యక్తం చేసింది. ప్రచార వేడుకల్లో ఇలాంటి ప్రశ్న ఎదురవటం దురదృష్టకమని వాపోయింది. ఆ వ్యక్తికి మహిళలపై ఎంత గౌరవం ఉందో ఈ ప్రశ్న తెలియజేస్తుందని పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. సిద్ధు జొన్నలగడ్డ సరసన నేహాశెట్టి నటించిన ‘డీజే టిల్లు’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం బుధవారం సాయంత్రం ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించింది. ట్రైలర్ ప్రదర్శన అనంతరం చిత్ర బృందం విలేకర్లతో ముచ్చటించింది. ట్రైలర్‌లోని ‘పుట్టు మచ్చల’కు సంబంధించిన సన్నివేశం గురించి మాట్లాడుతూ.. సదరు విలేకరి "హీరోయిన్‌కి సినిమాలో కాకుండా రియల్‌గా ఎన్ని పుట్టు మచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?" అని సిద్ధుని ప్రశ్నించాడు. సంబంధింత వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేయగా నేహా స్పందించింది. అభిమానులు, పలువురు నెటిజన్లు నేహాకు మద్దతు పలికారు. ఈ ఘటన చిత్ర వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నా ఉద్దేశం అది కాదు..
"ఇదొక రొమాంటిక్ ఫిల్మ్. నేను అడిగింది రొమాంటిక్ ప్రశ్న. అందులో ఎలాంటి ద్వందార్థం లేదు. దయచేసి నన్ను తప్పు పట్టొద్దు" అని విలేకరి ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. 'డీజే టిల్లు' ట్రైలర్ చాలా బాగుందన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
18న మాతృదేవోభవ
Matudevobhava movie: శ్రీనివాస్, అమృతా చౌదరి జంటగా కె.హరనాథ్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాతృదేవోభవ’. వెంకటేశ్వరరావు నిర్మాత. సుమన్, సుధ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ "ఇంత మంచి సందేశాత్మక చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘ఇది నా చిత్రం అని గర్వంగా చెప్పుకునే సినిమా. ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది" అన్నారు నటి సుధ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఓ పండగలా 'సెహరి'
Sehari trailer: హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘సెహరి’. అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు. కోటి, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో హర్ష్ మాట్లాడుతూ ‘‘నేను రాసిన కథను ఊహించిన దానికంటే అద్భుతంగా సాగర్ తెరకెక్కించాడు. తను త్వరలో పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోతాడు. ఆద్యంతం వినోదం పంచే చిత్రమిది. ఇందులో కోటిగారి నటనలో కొత్త కోణం చూస్తారు’’ అన్నారు. ‘‘నేనిందులో హీరో తండ్రి పాత్ర పోషించాను. ఇంట్లో మా అబ్బాయితో ఎలా ఉంటానో.. సినిమాలో అలా చేశాను. ప్రశాంత్ మంచి సంగీతమిచ్చారు’’ అన్నారు నటుడు, సంగీత దర్శకుడు కోటి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సెహరి’ అంటే సెలబ్రేషన్స్ అని అర్థం. ఈ పేరుకు తగ్గట్లుగానే సినిమా ఓ పండగలా ఉంటుంది’’ అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
థ్రిల్ పంచే.. 'అం అః'
సుధాకర్ జంగం, లావణ్య జంటగా శ్యామ్ మండల తెరకెక్కిస్తున్న చిత్రం ‘అం అః’. ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్.. అన్నది ఉపశీర్షిక. జోరిగె శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. సందీప్ కుమార్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సుధాకర్ మాట్లాడుతూ ‘‘ఇదొక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. యువతరాన్ని అలరించే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. చిరంజీవి గారి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. అందుకే ఈనెల 27న హైదరాబాద్‌లో వెయ్యి మందితో ఓ క్విజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో చిరు 150 సినిమాలపై ప్రశ్నలు అడుగుతాం. దీనికి ప్రైజ్ మనీ రూ.5లక్షలు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.సందీప్ కుమార్, కెమెరా: ఎస్.శివారెడ్డి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
‘సంస్కార్ కాలనీ’లో ఏం జరిగింది?
‘రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘గల్ఫ్’, ‘వలస’ లాంటి వైవిధ్యభరిత చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త సినిమా ‘చి69 సంస్కార్ కాలనీ’. ఎస్తర్ నోరోన్హా, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. బి.బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘కమర్షియల్ హిట్ కోసం కాకుండా ఓ సామాజిక బాధ్యతతో ఈ చిత్రం చేయడం జరిగింది. స్వాతి మంత్రిప్రగడ నాకీ కథ ఇచ్చింది. ప్రస్తుత సమాజంలోని అనేక సమస్యల్ని ఇందులో చర్చించాం. అందరినీ అలరిస్తూ.. ఆలోచింపజేసేలా ఉంటుందీ చిత్రం’’ అన్నారు. ‘‘ఓ సినిమా పనిపై ముంబయి వెళ్లినప్పుడు.. అక్కడ మాకు ఎదురైన కొన్ని అనుభవాలను, పేపర్‌లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కొన్ని యథార్థ సంఘటనలను తీసుకుని ఈ చిత్రం చేశాం. ఇందులో చక్కటి సందేశముంది. మా గత చిత్రాల్లాగే ఈ సినిమానీ ఆదరించాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో కథా రచయిత స్వాతి, ఎడిటర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
- ఆ స్పెషల్ సాంగ్‌కు సమంతనే కరెక్ట్: దేవీశ్రీ ప్రసాద్
- చిట్టి పొట్టి బట్టలతో ప్రాక్టీస్.. 'ఊ అంటావా మామా..' మేకింగ్ వీడియో వైరల్!
- ఈ సాంగ్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్!
- బాలీవుడ్లో బన్నీ ధమాకా.. రూ.100 కోట్ల 'పుష్ప'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!