DJ Tillu heroine Neha Shetty Emotional post జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు.. ఇష్టమైన వ్యక్తి పక్కనలేకపోవడం తనని ఎంతో బాధకు గురి చేసిందని నటి నేహా శెట్టి అన్నారు. ఆమె కథానాయికగా నటించిన చిత్రం 'డీజే టిల్లు'. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శనివారం విడుదలైంది. రొమాంటిక్, కామెడీ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ మెప్పించేలా ఉందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'డీజే టిల్లు' విజయంపై నేహాశెట్టి స్పందించారు. తన కిష్టమైన వ్యక్తిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
"నా అతి పెద్ద అభిమాని, స్ఫూర్తిప్రదాత, బామ్మను ఇటీవల కోల్పోయాను. నాకు రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి.. నేను ఎక్కడ ప్రదర్శనలిచ్చినా మా బామ్మ ముందు వరుసలో కూర్చొని ప్రోత్సహిస్తూ ఉండేది. ఫిబ్రవరి 12వ తేదీ నా జీవితంలోనే ఎంతో ముఖ్యమైన రోజు. కానీ, నా విజయాన్ని చూసేందుకు ఆమె ఇప్పుడు నా పక్కన లేదని తెలిసి హృదయం ముక్కలైంది. ఆమె ఆశీస్సులు ఎప్పటికీ నాపై ఉంటాయని భావించి కాస్త కుదుటపడ్డా. ఐ లవ్ యూ బామ్మ. డీజే టిల్లు విజయం నీకే అంకితం చేస్తున్నా. అలాగే మా ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు" అని నేహా తెలిపారు. ఇక 'డీజే టిల్లు' విజయానికి రెండు రోజుల ముందు నేహా తన బామ్మని కోల్పోయారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: 'డీజే టిల్లు' పోరి.. మస్తు హుషారున్నది!