ముంబయిలో తౌక్టే తుపాను బీభత్సం సృష్టించిన వేళ.. టీవీ నటి దీపికా సింగ్ చేసిన ఫొటో షూట్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తుపాను ధాటికి ముంబయిలోని ఓ ప్రాంతంలో చెట్టు నేలకొరగగా.. దాని వద్ద దీపికాసింగ్ ఫొటోషూట్ నిర్వహించింది. ఆ చిత్రాలను సైక్లోన్ తౌక్టే ఫొటోషూట్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వల్ల నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ ఫొటోలకు తోడు తుపానును మీరు ఎలాగు శాంతపరచలేరు కాబట్టి మిమ్మల్ని మీరు శాంతపరుచుకోండి అంటూ.. దీపిక చేసిన ట్వీట్‌పై కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుపాను కారణంగా ప్రజలు మరణిస్తుంటే.. మీకు ఆనందంగా ఉందా అంటూ నెటిజన్లు దీపికాసింగ్‌ను తిట్టిపోశారు. బాధితులకు సేవ చేయాల్సిన సమయంలో ఈ పైత్యం ఏంటంటూ కామెంట్ చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి.. ఆర్ఆర్ఆర్: కొమురం భీమ్ లుక్ అప్డేట్