"నా గురించి ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా, వాటిని సీరియస్‌గా తీసుకోను. పనీపాట లేని వాళ్లే అలాంటి కామెంట్లకు దిగుతుంటారు. వాటిని పట్టించుకోవడానికి నాకు తీరిక లేదు, నేను చాలా బిజీ" అని హీరోయిన్ దిశా పటానీ అంటోంది. 'లోఫర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు తన అందాలను పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన ఫిట్నెస్ ఫొటోలతో పాటు.. అందచందాలను ప్రదర్శిస్తూ చిత్రాలను ఉంచుతుంటుంది. ఇలా ఉంచిన ఓ ఫొటోపై వచ్చిన కామెంటుకు స్పందించింది.
'నా పని నేను చేసుకుంటూ వెళుతుంటా. పక్క వారి చర్యలు, మాటల గురించి ఆలోచిస్తే.. ఉన్నచోటనే ఉండిపోవాల్సి వస్తుంది' అని దిశా వివరిం చింది. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ 'రాధే'లో నటిస్తోంది. రంజాన్ కానుకగా మే 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: అలాంటి వాడి కోసమే ఎదురుచూస్తున్నా: దిశా పటానీ