ETV Bharat / sitara

పాన్​ఇండియా కథతో పూరీ.. 14రీల్స్​తో హరీశ్​ - హరీశ్​ శంకర్​ కొత్త సినిమా అప్​డేట్​

టాలీవుడ్​ స్టార్​ దర్శకులు పూరీ జగన్నాథ్​, హరీశ్​ శంకర్​లు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు అభిమానులకు సంకేతాలు అందించారు. పాన్​ ఇండియా కథతో పూరీ సిద్ధమవగా.. గతంలో హిట్​ దక్కించుకున్న నిర్మాణ సంస్థలో మరో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు హరీశ్​​ తెలిపారు.

Directors puri jagannadh, Harish Shankar new movie updates
పాన్​ఇండియా కథతో పూరి.. 14రీల్స్​తో హరీశ్​
author img

By

Published : May 19, 2020, 10:41 AM IST

లాక్​డౌన్​లో కొత్త కథలు సిద్ధం చేసే పనిలో పడ్డారు టాలీవుడ్​ స్టార్​ దర్శకులు. ఈ విరామ సమయంలోనే కొత్త సినిమాలకు సన్నాహాలు చేసేస్తున్నారు. అందులో హరీశ్​ శంకర్​, పూరీ జగన్నాథ్​లు ఉన్నారు. వారిద్దరు తెరకెక్కించబోయే కొత్త ప్రాజెక్టుల సంకేతాలను సోషల్​మీడియాలో తాజాగా అందించారు.

అదే నిర్మాణ సంస్థతో..

'గద్దలకొండ గణేష్‌' తర్వాత మరోసారి హరీశ్​ శంకర్‌ 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం హరీష్‌ శంకర్‌.. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. ఆ చిత్రం తర్వాతే 14రీల్స్‌ ప్లస్‌ నిర్మించే ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. దీని గురించి ఆ సంస్థ అధినేతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట మాట్లాడుతూ "'గద్దలకొండ గణేష్‌'తో మంచి విజయం సాధించాం. ఇప్పుడు మరోసారి హరీష్‌తో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్టు కోసం పనిచేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాం" అన్నారు.

మరో పాన్​ఇండియా సినిమాతో పూరి

అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మరోసారి పాన్‌ ఇండియా చిత్రం చేయబోతున్నారు. అందుకోసం కథను సిద్ధం చేశారు. లాక్‌డౌన్‌ ప్రకటించగానే, ఆయన కొత్త కథ రాసుకోవడంపైనే దృష్టి పెట్టారు. ఆ కథ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇటీవల దర్శకులు కథలు సిద్ధం చేసుకుని, వాటిని వీడియో కాల్‌ ద్వారా కథానాయకులకు వినిపించి ఒప్పిస్తున్నారు. త్వరలోనే పూరి కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అందులో ఓ అగ్ర హీరో నటించనున్నట్లు తెలుస్తోంది. పూరీ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పాన్‌ ఇండియా స్థాయిలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇదీ చూడండి.. సోషల్​మీడియాలో 'పాతాళ్​లోక్​' వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.