యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'ఆది' చిత్రంతో మాస్, కమర్షియల్ డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు వి.వి.వినాయక్. మొదటి చిత్రంతోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్న ఆయన.. ఆ తర్వాత అగ్ర కథానాయకులతో ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను ఖాతాలో వేసుకున్నారు. అయితే తాజాగా 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ఆయన.. తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగానే తాను హీరోగా మారడానికి గల కారణాన్ని వెల్లడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"ఓ రోజు నిర్మాత దిల్‌రాజు నా దగ్గరకు వచ్చి ఓ స్క్రిప్ట్ ఉందని చెప్పి అందులో నేనే హీరోగా చేయాలని చెప్పారు. ఆయన ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నారేమో. నేనూ కూడా నా ఒళ్లు తగ్గించడానికి ఇదే సరైన అవకాశం అనుకుని అంగీకరించా. అలా 'సీనయ్య' సినిమా ప్రారంభించాం. ప్రస్తుతం కరోనా వల్ల ఆగిపోయింది. తెరపైకి వస్తుందో లేదో చెప్పలేను."
-వీవీ వినాయక్, దర్శకుడు.
దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనకెంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు వీవీ వినాయక్. "గతంలో మా కుటుంబం ఆర్థికంగా చాలా దెబ్బతింది. ఆ సమయంలోనే సత్యనారాయణ ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని నేను ఇండస్ట్రీకి వచ్చా. జాక్‌పాట్ కొట్టేశా. అప్పటి నుంచి జీవితం చాలా బాగుంది" అని తన మనసులోని మాటను చెప్పారు వినాయక్.
ఇదీ చూడండి బాలయ్య 'నర్తనశాల' ఫస్ట్‌లుక్ వచ్చేసింది