Sirivennela Passed Away: ప్రముఖ సినీ గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి కన్నుమూత చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. మహోన్నత ప్రజ్ఞాశాలిని కోల్పోయామని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సీతారామశాస్త్రి ప్రజ్ఞ, పాటవాల గురించి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఏనాడో చెప్పారు. ఆయన తెలుగు సినీ కవి కావటం ఆయన దురదృష్టం అని, తెలుగు వారి అదృష్టమంటూ భావోద్వేగంగా ప్రసంగించారు.
Trivikram Srinivas on Sirivennela: "సీతారామశాస్త్రిగారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న పదాలు సరిపోవు. ఎందుకంటే 'సిరివెన్నెల'సినిమాలో రాసిన 'ప్రాగ్దిశ వేణియపైన, దినకరమయూఖ తంత్రులపైన' ఆ పాట విన్న వెంటనే తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని 'శబ్ద రత్నాకరం' అంటారని తెలుసుకున్నా. అది కొనుక్కొని తెచ్చుకుని, ప్రాగ్దిశ అంటే ఏంటి? మయూఖం అంటే ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నా. ఒక పాటను అర్థమయ్యేలానే రాయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి అని కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచంమీద వేటాడటానికి బయలుదేరతాడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దు. ఒక మనిషిని కదిలించే శక్తి సాహిత్యానికి ఉంటుంది" అంటూ త్రివిక్రమ్ ఆవేశంగా మాట్లాడిన వీడియోను మీరూ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">