'చిత్రం', 'జయం' వంటి చిత్రాలతో ప్రేమకథల్ని సరికొత్తగా చూపి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ. మధ్యలో వైఫల్యాలు వెంటాడినా...రానా కథానాయకుడిగా తెరకెక్కించిన 'నేనే రాజు నేనే మంత్రి'తో హిట్ కొట్టాడు. ఈ ఏడాది బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా 'సీత' అనే వైవిధ్యభరిత చిత్రాన్ని తీశాడు. తేజ తర్వాతి చిత్రం బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌తో తీయబోతున్నాడని ఫిల్మ్ వర్గాల సమాచారం.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 'ఆర్టికల్ 370' పై ఓ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమితాబ్‌తో చర్చలు జరిపాడని, ఆయన కూడా కథపై సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని సినీ వర్గాల్లో టాక్. ఓ ప్రముఖ నిర్మాత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇవీ చూడండి.. దీపిక ద్రౌపదిగా 'మహాభారతం'...