తాను ఎలాంటి రీమేక్ సినిమాలు చేయట్లేదని 'సాహో' దర్శకుడు సుజీత్ స్పష్టం చేశారు. ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టగా, దాని కింద కామెంట్లలో ఆసక్తికర చర్చ సాగింది. ఇందులో భాగంగా 'సాహో' డిలీట్ సన్నివేశాల విడుదల గురించి పలువురు నెటిజన్లు అడిగారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్‌లో నటించనున్నారని, దానికి యువ డైరెక్టర్ సుజీత్ అంటూ గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. వీటిపై అటు చిరు, ఇటు సుజీత్ గాని ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ దర్శకుడు పోస్ట్ పెట్టడం వల్ల ఓ విషయంపై స్పష్టత వచ్చేసింది.

అలానే 'సాహో' డిలీటెడ్ సీన్స్ విడుదల ఎప్పుడంటూ అభిమానులు అడగ్గా.. లాక్డౌన్ వల్ల ఆ కంపెనీ మూసివేశారని, తెరుచుకున్న తర్వాత తన సొంత డబ్బులతో వీఎఫ్ఎక్స్ చేయించి, విడుదల చేస్తానని సుజీత్ చెప్పారు.
