ప్రేమ కథల్ని సున్నితంగా చూపించడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల దిట్ట. ఎక్కువగా స్నేహం, ప్రేమ, కుటుంబ నేపథ్య కథలతో సినిమాలు తీశారు. గతంలో ఓసారి పంథా మార్చి 'అనామిక' అనే థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. బాలీవుడ్ 'కహానీ'కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం మిశ్రమఫలితాన్ని అందుకుంది. మళ్లీ ఇప్పుడు అదే జోనర్లో తన తర్వాతి ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమవుతున్నారీ డైరెక్టర్.
ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవిలతో 'లవ్‌స్టోరీ' తీస్తున్నారు శేఖర్. షూటింగ్ చివరి దశలో ఉండగా, లాక్డౌన్ వల్ల అది నిలిచిపోయింది. దీంతో ఈ విరామ సమయంలోనే తదుపరి చిత్రానికి శేఖర్, కథ సిద్ధం చేస్తున్నారట. అయితే ఈసారి ప్రేమకథ కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తీయాలని భావిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టు 'అనామిక'లా నాయిక ప్రాధాన్యమా? లేదా మరేదైనా జోనర్ అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.