ETV Bharat / sitara

'ఆ సీన్​ అత్యద్భుతం- తారక్, చరణ్​ ఇరగదీశారు' - రాజమౌళి

RRR Movie: మెగాపవర్​ స్టార్​ రామ్​చరణ్​, యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్​ఆర్​ఆర్. ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల ముంబయిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. టీజర్​, ట్రైలర్​లో చూపించని ఓ సీన్​ ఉందని.. ఆ సీన్​ థియేటర్లో చూస్తే మీ నరాలు బిగుసుకుపోతాయన్నారు. అంతేకాదు.. రామ్​చరణ్​, ఎన్టీఆర్​ల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

RRR Movie
రాజమౌళి
author img

By

Published : Feb 8, 2022, 5:55 PM IST

RRR Movie: "రామ్‌ చరణ్‌ అద్భుతమైన నటుడు. కానీ, ఆ విషయం తనకు తెలియదు. ఎన్టీఆర్‌ కూడా అద్భుతమైన నటుడు. ఆ విషయం తనకు తెలుసు" అని 'ఆర్‌ఆర్‌ఆర్‌' కథానాయకుల గురించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఈ ఇద్దరు హీరోలతో ఆయన తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమా ప్రచారాన్ని ముంబయిలో ఇటీవల నిర్వహించారు. చరణ్‌, తారక్‌ల మధ్య ఉన్న తేడా గురించి రాజమౌళి మాట్లాడారు. సల్మాన్‌ఖాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ వేడుకకు సంబంధించిన వీడియోల్ని చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వివరాలివీ..

"ఓ సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తికాగానే రామ్‌ చరణ్‌ని హగ్‌ చేసుకుని బాగా చేశావు అని కితాబిస్తా. 'బాగుందా సర్‌.. మీకు నచ్చిందా సర్‌.. మీకు నచ్చితే ఓకే సర్‌' అని అంటాడు. అదే తారక్‌ విషయానికొస్తే.. తన నటన చూసి బాగుందని చెప్పేలోపు 'జక్కన్నా..' అదరగొట్టేశా కదా అంటాడు. తనపై తనకున్న విశ్వాసం అది. ఇలాంటి ఇద్దరు గొప్ప నటులతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. సినిమా కోసం వారిద్దరినీ విపరీతంగా కష్టపెట్టా. చిత్రీకరణ తొలిరోజు నుంచే శ్రమపెట్టా. పరిచయ సన్నివేశం కోసం తారక్‌ను పాదరక్షలు లేకుండా అడవిలో పరిగెత్తించా. చరణ్‌ను వేలమంది సభ్యుల మధ్య దుమ్ములో నిలబెట్టా. అతనికి చెమట, రక్తం కారుతున్నా సరే వదిలిపెట్టలేదు. నా కెరీర్‌లో ది బెస్ట్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ ఇది." అని అన్నారు రాజమౌళి.

RRR Movie
ముంబయిలో జరిగిన ఈవెంట్​లో బాలీవుడ్​ నటుడు సల్మాన్​ ఖాన్​తో 'ఆర్​ఆర్​ఆర్'​ బృందం

బ్రిడ్జిసీన్​లో..

"చిత్రీకరణ రెండోరోజు బ్రిడ్జి సన్నివేశం తెరకెక్కించాం. దీని కోసం వీరిద్దరూ తాళ్ల సాయంతో 60 అడుగులు గాల్లోకి జంప్‌ చేశారు. 5- 6 డిగ్రీల ఉష్టోగ్రత వద్ద 1200 మంది ఆర్టిస్టులతో 65 రాత్రులు ఇంటర్వెల్‌ సీన్‌ షూట్‌ చేశాం. పాటలు, క్లైమాక్స్‌ కోసం వారు అంతే కష్టపడ్డారు. ఈ చిత్రంలో అత్యద్భుతమైన సన్నివేశం ఒకటుంది. టీజర్‌, ట్రైలర్‌లో దాన్ని చూపించలేదు. సినిమాలో ఆ సీక్వెన్స్‌ వచ్చినప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీ శరీరంలోని ప్రతి నరం బిగుసుకుపోతుంది. చరణ్‌, తారక్‌ అలాంటి పెర్ఫామెన్స్‌ ఇచ్చారు" అని రాజమౌళి అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాజమౌళికి సినిమానే ప్రపంచం..

"ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రైలర్‌ ఫెంటాస్టిక్‌. ఈ చిత్రం కోసం చరణ్‌, తారక్‌ చాలా హార్డ్‌వర్క్‌ చేశారు. ఈ ఇద్దరితో కలిసి సినిమా తీసేందుకు రాజమౌళి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని, ఇందులో అలియాభట్‌ నటిస్తుందని తెలియగానే ఆనందించా. రాజమౌళి చాలా ప్రతిభావంతుడు. రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తిండి, నిద్ర, శ్వాస.. అన్నీ సినిమానే" అని సల్మాన్‌ఖాన్‌ పేర్కొన్నారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.