ETV Bharat / sitara

PellisandaD movie: 'అలా జరగడం యాదృచ్ఛికంగా ఉంది' - రోషన్​ శ్రీలీల

'పెళ్లిసందD'(raghavendra rao pelli sandadi) విజయవంతంగా ప్రదర్శితమవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు దర్శకుడు రాఘవేంద్రరావు. దీంతోపాటు(pelli sandadi new movie) ఆంధ్రప్రదేశ్​లో వంద శాతం సామర్థ్యంతో సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

raghavendrarao
రాఘవేంద్రరావు
author img

By

Published : Oct 16, 2021, 7:07 PM IST

శ్రీకాంత్ తనయుడు(raghavendra rao pelli sandadi) రోషన్, శ్రీలీల జంటగా రాఘవేందర్ రావు సమర్పణలో విడుదలైన చిత్రం 'పెళ్లిసందD' . గౌరి రోణంకి దర్శకురాలు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్ పుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 25 ఏళ్ల నాటి పెళ్లిసందడి కళ మళ్లీ వెండితెరపై కనిపిస్తుందని అన్నారు. దర్శకురాలు గౌరితోపాటు రోషన్, శ్రీలీల భవిష్యత్, సంగీత పరంగా నాటి ప్రాధాన్యత ఏ మాత్రం చెదరకుండా ఈ పెళ్లిసందD(pelli sandadi 2021 trailer) ఆనందాన్ని తీసుకొచ్చిందన్నారు. చిత్ర యూనిట్ తో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.

పెళ్లిసందD మూవీ టీమ్​

యాదృచ్చికంగా ఉంది

ఆంధ్రప్రదేశ్​లో సినిమా థియేటర్లలో 100 శాతం సామర్థ్యంతో సినిమా ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితోపాటు మంత్రివర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేలాది మంది ఆధారపడిన చిత్ర పరిశ్రమకు ఈ అనుమతి ఎంతో ఊరటనిస్తుందన్నారు. వంద శాతం సామర్థ్యం ఇస్తుందనే నమ్మకాన్ని మూడు రోజుల ముందే అనుకున్నానని, తన చిత్రం విడుదలకు ఒకరోజు ముందు అనుమతి రావడం యాదృచ్ఛికంగా ఉందన్నారు. ప్రజలు బలంగా కోరుకుంటే అది జరుగుతుందనడానికి ఇదే నిదర్శనమని రాఘవేందర్ రావు తెలిపారు.

రాఘవేంద్రరావుతో పాటు సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన రోషన్​, శ్రీలీల కూడా 'పెళ్లిసందD'ని ఆదిరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: PellisandaD movie: 'ఇకపై అలాంటి సినిమాలే చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.