ETV Bharat / sitara

'లైగర్​' కొత్త అప్​డేట్.. త్వరలో 'పూరీ' కలల ప్రాజెక్ట్​ షురూ! - లైగర్​ సినిమా

Puri Jagannadh News: దర్శకుడు పూరీ జగన్నాథ్​ ఆసక్తికర అప్​డేట్​ ఇచ్చారు. విజయ దేవరకొండ కథనాయకుడిగా తెరకెక్కిస్తున్న లైగర్​ పూర్తయిందని.. ఇక తదుపరి చిత్రం 'జనగణమన'ను త్వరలో పట్టాలు ఎక్కించనున్నట్లు తెలిపారు.

Puri Jagannadh News
పూరీ జగన్నాథ్​
author img

By

Published : Feb 6, 2022, 10:44 PM IST

Puri Jagannadh News: తన కలల ప్రాజెక్టు 'జనగణమన'పై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ క్లారిటీ ఇచ్చారు. విజయ్‌ దేవరకొండ హీరోగా తాను రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'లైగర్‌' షూటింగ్‌ పూర్తైన సందర్భంగా 'జనగణమన' గురించి మాట్లాడారు. "లైగర్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈరోజుతో జనగణమన" అని ఆయన చెప్పిన పాడ్‌కాస్ట్‌ను నటి, నిర్మాత ఛార్మి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌ (#JGM) ను జతచేశారు. పూరీ జగన్నాథ్‌ గతంలోనే 'జనగణమన' అనే ప్రాజెక్టును తెరకెక్కించాలని భావించారు. ప్రముఖ నటుడు మహేశ్‌బాబును హీరోగా అనుకున్నారు. 'పోకిరి', 'బిజినెస్‌మ్యాన్‌' సూపర్‌హిట్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం వల్ల అప్పట్లో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కానీ, అనివార్య పరిస్థితుల కారణంగా ఆ సినిమా పట్టాలెక్కలేదు.

ఇటీవల మళ్లీ ఈ సినిమా గురించి చర్చ సాగింది. 'లైగర్‌' హీరో విజయ్‌ దేవరకొండతోనే పూరీ జగన్నాథ్‌ 'జనగణమన' చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయంటూ టాలీవుడ్‌లో వార్తలొచ్చాయి. మరోవైపు, అసలు ఈ చిత్రం ఉంటుందా లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. పూరీ మాటలతో ఇప్పుడు 'జనగణమన'పై స్పష్టత వచ్చింది. మరి ఈ సినిమాను విజయ్‌ దేవరకొండతోనే చేస్తారా? మరో హీరోతోనా? తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో తెరకెక్కుతున్న చిత్రమే 'లైగర్‌'. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌ కీలక పాత్ర పోషించారు. విజయ్‌ సరసన అనన్య పాండే సందడి చేయనుంది. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇదీ చూడండి : కీరవాణి వింత ప్రవర్తన.. డ్రైవర్​కు భయం, డైరెక్టర్​కు అయోమయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.