ETV Bharat / sitara

ఆయన సినిమా ప్రేమకు చిరునామా!

ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించి కుర్రకారు మదిలో ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు దర్శకుడు మణిరత్నం. దక్షిణాది భాషల్లో పలు చిత్రాలను రూపొందించి విభిన్న శైలితో విశేషాదరణ దక్కించుకున్నారు. 'రోజా' సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన మణిరత్నం.. నేడు 64వ పడిలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

Director Manirathnam Birthday Special Story
క్లాసికల్​, ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​ మణిరత్నం
author img

By

Published : Jun 2, 2020, 6:34 AM IST

భారత సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు దర్శకుడు మణిరత్నం. సినిమాలు తెరకెక్కించడంలో ఆయన శైలే విభిన్నంగా ఉంటుంది. మణిరత్నం తీసిన ప్రేమకథా చిత్రాలు కుర్రకారు మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దర్శకుడిగా తొలి కన్నడ చిత్రం 'పల్లవి అనూ పల్లవి'తో పురస్కారం అందుకుని విజయపరంపర కొనసాగించారు. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయన తీసిన తొలి చిత్రం 'గీతాంజలి' బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాసింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'రోజా'తో ప్రేమికుల మనసు దోచేశారు మణి. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఇది ఆయనకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. మణిరత్నం ప్రేమ కథలను దేశానికి పరిచయం చేసి అఖండ విజయం నమోదు చేసిన చిత్రమది. తర్వాత దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీసిన 'గాయం' చిత్రానికి కథ రాసిందీ మణిరత్నమే. 'బొంబాయి' చిత్రంతో మంచి మెలోడీ హిట్టందుకున్నారు. 'తాజ్‌ మహల్‌' లాంటి ఎన్నో చిత్రాలకు కథ రాసి ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోయారు.

భారత ప్రభుత్వం 2002లో మణిరత్నాన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇప్పటి వరకు ఈయన ఆరు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఎన్నో ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలను అందుకున్నారు. మణిరత్నం అసలు పేరు గోపాల రత్నం సుబ్రహ్మణ్యం. 1956లో జూన్‌ 2న జన్మించారు.

ఇదీ చూడండి... అలా మాధురి అవకాశం అమలను వరించింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.