'సింగం' సిరీస్‌తో తెలుగులోనూ దర్శకుడు హరి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అరుణ్ విజయ్‌తో సినిమా చేస్తూ, షూటింగ్లో ఉన్న ఆయన హైఫీవర్‌తో ఆస్పత్రిలో చేరారు.
ఇది చదవండి: గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి
ఈ చిత్రబృందంలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలగా, మిగతా వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే దర్శకుడు హరికి నెగిటివ్ వచ్చినట్లు సమాచారం. కానీ హైఫీవర్‌తో ఆయన ఆస్పత్రిలో చేరడం వల్ల సందేహలు వస్తున్నాయి.
తమిళనాడులో పళనిలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. ప్రియా భవాని శంకర్ హీరోయిన్. ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి చిత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
![Director Hari hospitalized with High fever](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11075231_417_11075231_1616154403449.png)
ఇవీ చదవండి: