యువ కథానాయకుడు రామ్ తన పుట్టినరోజు సందర్భంగా ఏం ప్రకటిస్తాడా? అని ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. శుక్రవారం (మే 15) రామ్ పుట్టిన రోజు. తాజాగా బర్త్‌డేకి ఏం సర్‌ప్రైజ్ ఇస్తున్నాడో చెప్పేశాడు.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా 'రెడ్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి మణిశర్మ సంగీత దర్శకత్వంలో రూపొందిన 'డించక్' అనే మాస్ బీట్‌కి సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నారు. ఫుల్ మాస్ సాంగ్ అని సమాచారం. స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ, నివేదా పేతురాజ్, అమృత అయ్యర్ నాయికలు. గతంలో విడుదలైన టీజర్ కోటికిపైగా వీక్షణలు సొంతం చేసుకుంది.