ETV Bharat / sitara

ప్రపంచవ్యాప్తంగా  'డీడీఎల్​జే' మళ్లీ విడుదల

బాలీవుడ్​ ప్రేమకథల్లో చెదిరిపోని స్థానాన్ని సొంతం చేసుకున్న సినిమా 'దిల్​వాలే దుల్హానియా లేజాయేంగే'. షారుఖ్​ ఖాన్, కాజోల్​ జంటగా నటించిన ఈ సినిమా.. ఇటీవలే పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మరోసారి విడుదలవుతోంది.

Dilwale Dulhania Le Jayenge to be re-released across world
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదలవుతోన్న 'డీడీఎల్​జే'
author img

By

Published : Oct 22, 2020, 1:34 PM IST

బాలీవుడ్​ ఎవర్​గ్రీన్​ క్లాసిక్​ 'దిల్​వాలే దుల్హానియా లేజాయేంగే'.. ఇటీవలే పాతిక వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 'డీడీఎల్​జే'ను ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విడుదల చేయాలని నిర్ణయించారు సినిమా డిస్ట్రిబ్యూటర్లు. గురవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల సంఘం.

" ప్రేక్షకులను డీడీఎల్​జే సినిమా ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడు థియేటర్లలోకి వచ్చినా అందరూ చూస్తూనే ఉన్నారు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానుల కోసం మరో సారి విడుదల చేయడం.. మాకు చాలా సంతోషంగా ఉంది. వెండితెరపై ఈ ప్రేమకథను అందరూ మళ్లీ చూసి ఆనందించవచ్చు. విదేశాల్లోని భారతీయుల ద్వారా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుంది."

-- నెల్సన్​ డిసౌజా, అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల సంఘం ఉపాధ్యక్షుడు

అమెరికా, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్​, కెనెడా, యూఏఈ, మారిషస్​, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, ఫిజి, నార్వే, స్పెయిన్​, స్విట్జర్​లాండ్​, ఈస్టోనియా, ఫిన్లాండ్​ దేశాల్లో డీడీఎల్​జే మళ్లీ విడుదల కానుంది.

ఆదిత్యాచోప్రా దర్శకత్వంలో వచ్చిన 'డీడీఎల్​జే'... అత్యధిక కాలం ప్రదర్శితమైన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది.

ఇదీ చూడండి:డీడీఎల్​జే@25: ప్రేమికులంటే గుర్తొచ్చేది షారుక్​, కాజోల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.