ETV Bharat / sitara

విజయ్- రష్మిక డేటింగ్? వైరల్​గా మారిన ఫొటోలు - రష్మిక

Rashmika and Vijay Devarakonda: యువ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటీ రష్మిక రిలేషన్​షిప్​లో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇటీవలే ఈ జంట నూతన సంవత్సర వేడుకలను కలిసే సెలబ్రేట్ చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. దాంతో వీరు డేటింగ్​లో ఉన్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది.

rashmika and vijay devarakonda
విజయ్ దేవరకొండ
author img

By

Published : Jan 4, 2022, 8:32 PM IST

Rashmika and Vijay Devarakonda: ఆన్‌స్క్రీన్‌ లవ్లీ పెయిర్‌గా యువ హృదయాలు గెలుచుకున్నారు నటి రష్మిక, నటుడు విజయ్‌ దేవరకొండ. 'గీత గోవిందం'లో రష్మిక- విజయ్‌ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అదే సమయంలో రష్మిక సైతం తన ప్రియుడు, కన్నడ నటుడు రక్షిత్​ శెట్టితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం.. ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. విజయ్‌తో ప్రేమలో ఉండటం వల్లే ఆమె రక్షిత్​తో బ్రేకప్‌ చెప్పారని పలువురు అనుకున్నారు కూడా. అలాంటిదేమీ లేదని రష్మిక- విజయ్‌ ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పటికీ ఇటీవలే వీళ్ల మధ్య ఉన్న రిలేషన్‌ మరోసారి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

rashmika and vijay devarakonda
ఆనంద్, రష్మిక

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇటీవల దేవరకొండ సోదరులు గోవాకు వెళ్లారు. న్యూ ఇయర్‌ విషెస్‌ తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా పలు ఫొటోలు షేర్‌ చేశారు. అదే సమయంలో రష్మిక సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. 'హ్యాపీ న్యూ ఇయర్‌ మై లవ్స్‌' అని హార్ట్‌ ఎమోజీతో ఓ ఫొటో షేర్‌ చేశారు. రష్మిక షేర్‌ చేసిన పిక్‌లో ఉన్న లొకేషన్‌.. ఆనంద్‌ షేర్‌ చేసిన ఫొటోలోనిది ఒకటే కావడం వల్ల అందరూ విజయ్‌- రష్మిక డేటింగ్‌లో ఉన్నారంటూ మాట్లాడుకుంటున్నారు.

rashmika and vijay devarakonda
విజయ్ దేవరకొండ

మరోవైపు, షూటింగ్స్‌ నిమిత్తం గత కొన్ని రోజులుగా ముంబయిలో ఉన్న ఈ జంట క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇటీవల డిన్నర్‌ డేట్‌కు వెళ్లారు. బాంద్రాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌ నుంచి వీళ్లిద్దరూ బయటకు వస్తోన్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

rashmika and vijay devarakonda
రష్మిక

ఇదీ చూడండి: ముంబయి వీధుల్లో విజయ్-రష్మిక.. ఏంటి సంగతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.