ETV Bharat / sitara

మెగాస్టార్ 'ఆచార్య' నుంచి కాజల్​ తప్పుకుందా?

'ఆచార్య' నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారు. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.

author img

By

Published : May 2, 2020, 1:11 PM IST

మెగాస్టార్ 'ఆచార్య' నుంచి కాజల్​ తప్పుకుందా?
హీరోయిన్ కాజల్ అగర్వాల్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య'కు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సినిమాకు తొలుత హీరోయిన్​గా అనుకున్న త్రిష.. ఇంతకు ముందే తప్పుకోగా, ఆ స్థానంలో ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్​ను ఎంపిక చేశారు. ఇప్పడు ఆమె కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాజల్​తో చిత్రీకరణ జరిపేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా పంజా విసిరింది. ఈ కారణంతో షూటింగ్​లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో 'ఆచార్య' కోసం ఈ భామ ఇచ్చిన డేట్లు కాస్త వృథా అయిపోయాయని... ఇందువల్లే తప్పుకుందని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంతన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Kajal Aggarwal
హీరోయిన్ కాజల్ అగర్వాల్

కాజల్ ప్రస్తుతం తమిళంలో యువహీరో ఉదయనిధి స్టాలిన్​తో సినిమా చేసేందుకు అంగీకరించింది. ఇందుకోసం ఈమెకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరు సినిమా నుంచి తప్పుకోవడానికి ఇదీ ఓ కారణంగా కనిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.