మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటి దియా మీర్జా పెళ్లికి సిద్ధమైందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖినీ ఫిబ్రవరి 15న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరు కొంతకాలంలో రిలేషన్షిప్లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అతి తక్కువ మంది అతిథుల మధ్య వీరి కల్యాణం జరగనుందని సమాచారం. దియాకు 2014లోనే సాహిల్ అనే వ్యక్తితో వివాహం జరగగా.. వారు 2019లో విడాకులు తీసుకున్నారు. వైభవ్ కూడా గతంలో సునైనా రేఖి అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం దియా మీర్జా.. నాగార్జునతో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. అరంగేట్ర దర్శకుడు అహిషోర్ సోలోమన్ దానిని తెరకెక్కిస్తున్నారు.
ఇదీ చూడండి: హాట్ లుక్స్‌తో అదరగొడుతున్న సోనమ్