ETV Bharat / sitara

రణ్‌వీర్‌-అలియా సినిమాలో​ లెెజెండరీ యాక్టర్లు - రణ్​వీర్​ సింగ్​​ ఆలియా

బాలీవుడ్ నిర్మాత కరణ్​ జోహార్(Karan Johar).. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' అనే ప్రేమకథకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రణ్​వీర్ సింగ్​(Ranveer Singh), అలియా భట్​(Alia Bhatt) హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్​ లెజెండరీ నటీనటులు ధర్మేంద్ర, జయా బచ్చన్​, షబానా అజ్మీ కీలకపాత్రలు పోషించనున్నారు.

Dharmendra, Jaya Bachchan, Shabana Azmi join Ranveer, Alia in KJo's next film
రణ్‌వీర్‌-అలియా సినిమాలో​ లెజండరీ యాక్టర్లు
author img

By

Published : Jul 6, 2021, 5:53 PM IST

Updated : Jul 6, 2021, 9:34 PM IST

'ఏ దిల్‌ హై ముష్కిల్‌'(Ae Dil Hai Mushkil) చిత్రం వచ్చి ఐదేళ్లు పూర్తవుతుంది. అప్పటి నుంచి మెగా ఫోన్‌ పట్టుకోని నిర్మాత కరణ్‌జోహార్‌(Karan Johar) మళ్లీ దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. 'రాకీ ఔర్‌ రాణికీ ప్రేమ్‌ కహానీ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని మంగళవారం ప్రకటించారు.

'గల్లీబాయ్‌'తో అలరించిన జోడీ రణ్‌వీర్ సింగ్‌‌(Ranveer Singh), అలియా భట్(Alia Bhatt) ఇందులో నటించనున్నారు. మంగళవారం (జులై 6) రణ్‌వీర్ 36వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

లెజండరీ నటీనటులతో..

ఈ సినిమాలో లెజండరీ నటీనటులు ధర్మేంద్ర(Dharmendra), జయా బచ్చన్​(Jaya Bachchan), షబానా అజ్మీ(Shabana Azmi) భాగం కానున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. సినిమాలో నటించే లెజండరీ యాక్టర్ల వివరాలను రణ్​వీర్​, అలియా వాయిస్​ఓవర్​తో వీడియోను పొందుపరిచారు. ధర్మేంద్ర, జయా బచ్చన్​ సినిమాలో రణ్​వీర్​ కుటుంబసభ్యులుగా నటించనుండగా.. మరోవైపు అలియా కుటుంబంలో షబానా అజ్మీ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి కథ ఇషితా మొయిత్రా, శశాంక్ ఖైతాన్ సుమిత్ రాయ్ అందించగా.. హిరో యశ్‌ జోహార్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇదీ చూడండి.. తాప్సీ తెలుగులో మళ్లీ.. రణ్​వీర్-ఆలియా లవ్​స్టోరీ

Last Updated : Jul 6, 2021, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.