ETV Bharat / sitara

''మహానటి'కి ఫిదా అయ్యా.. మీరూ చూడండి' - ''మహానటి'కి ఫిదా అయ్యా.. మీరు చూడండి'

దిగ్గజ నటి సావిత్రి బయోపిక్​ 'మహానటి' చూసి ఫిదా అయ్యానని చెప్పింది స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె. ప్రతిఒక్కరు తప్పక ఈ సినిమా చూడాలని.. అందుకు సంబంధించిన ఓ పోస్టర్​ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.​

Deepika Padukone
​ దీపికా పదుకొణె
author img

By

Published : May 30, 2020, 8:27 AM IST

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె, తెలుగు చిత్రం 'మహానటి'కి ఫిదా అయింది. ఇటీవలే ఈ సినిమా చూసిన ఆమె.. ఇన్‌స్టా‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంది. "వెంటనే ఈ సినిమా చూడండి" అంటూ 'మహానటి' పోస్టర్‌ను నెటిజన్లతో పంచుకుంది.‌ దీనిపై స్పందించిన చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. "తెల్లవారుజామున కూల్‌ నోటిఫికేషన్‌తో నిద్రలేచా" అని పేర్కొన్నారు.

అలనాటి తార సావిత్రి జీవితాధారంగా తీసిన బయోపిక్ 'మహానటి'. కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌ పోషించింది. వైజయంతి మూవీస్‌, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 2018లో విడుదలైన ఈ సినిమా.. విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలూ అందుకుంది. ఈ చిత్రానికిగానూ కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 'మహానటి'ని ప్రదర్శించారు.

దీపిక.. ప్రస్తుతం తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ముంబయిలోని ఇంట్లోనే ఉంటోంది. ఈ లాక్​డౌన్ సమయంలో తనను తాను బిజీగా ఉంచుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో తీసిన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటోంది.

ఇదీ చూడండి : సోనూసూద్​ దాతృత్వం.. కూలీల కోసం ఏకంగా విమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.