ETV Bharat / sitara

ఎన్​సీబీ విచారణ తర్వాత గోవాలో దీపిక - షూటింగ్​ సెట్​లో దీపికా

ఎన్​సీబీ విచారణను ఎదుర్కొన్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె.. సినిమా చిత్రీకరణలో తిరిగి పాల్గొంది. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న షూటింగ్​కు హాజరైంది.

Deepika
దీపికా
author img

By

Published : Oct 16, 2020, 7:48 PM IST

డ్రగ్స్​ కేసు విచారణలో భాగంగా ఎన్​సీబీ విచారణకు ఇటీవలే హాజరైన నటి దీపికా పదుకొణె.. గోవాలో జరుగుతున్న చిత్రీకరణలో తిరిగి పాల్గొంది. శకున్ బత్రా దర్శకత్వం వహిస్తున్న సినిమా సెట్స్​లో అడుగుపెట్టింది. ఈమెతో పాటు యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిలేషన్​షిప్ నేపథ్య కథతో దీనిని రూపొందిస్తున్నారు.

ఇదీ జరిగింది

శకున్​ బత్రా తీస్తున్న సినిమా గోవాలో షూటింగ్​ జరుపుకుంది. సెప్టెంబరులో దీపిక చిత్రీకరణలో పాల్గొంది. ఆ సమయంలోనే సుశాంత్​ మృతితో సంబంధముందనే ఆరోపణలతో, డ్రగ్స్​ కేసులో భాగంగా పలువురు స్టార్స్​ విచారించింది ఎన్​సీబీ. ఈ క్రమంలోనే దీపికకు సమన్లు జారీ చేసింది. దీంతో గోవాలో ఉన్న ఆమె.. షూటింగ్​ మధ్యలోనే ఆపేసి, ముంబయికి వచ్చి విచారణకు హాజరైంది.

ఈ ఏడాది పారంభంలో 'ఛపాక్'​ చిత్రంలో విభిన్న పాత్రతో అలరించింది దీపిక. భర్త రణ్​వీర్​ సింగ్​తో కలిసి '83'లో నటిస్తోంది. నాగ్​ అశ్విన్- ప్రభాస్ సినిమాలోనూ హీరోయిన్​గా ఎంపికైంది.​

ఇదీ చూడండి 'కొలవెరి' మ్యూజికల్​ మ్యాజిక్​.. ఓ సంచలనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.