ETV Bharat / sitara

Shah Rukh Khan: 'పటాన్​' షూటింగ్​లో దీపికా పదుకొణె - దీపికా పదుకొణె

షారుక్ ఖాన్ హీరోగా 'పటాన్' చిత్రం తెరకెక్కుతోంది. కరోనా రెండో దశ తర్వాత తిరిగి ప్రారంభమైన షూటింగ్​లో షారుక్​తో(Shah Rukh Khan) పాటు జాన్​ అబ్రహం పాల్గొంటున్నారు. ఇప్పుడు హీరోయిన్​ దీపికా పదుకొణె(Deepika Padukone) సెట్లో అడుగుపెట్టినట్లు దర్శకుడు సిద్ధార్థ్​ ఆనంద్​ వెల్లడించారు.

Deepika Padukone joins SRK on Pathan sets
'పటాన్​' షూటింగ్​లో దీపికా పదుకొణె
author img

By

Published : Jul 5, 2021, 8:46 AM IST

Updated : Jul 5, 2021, 11:40 AM IST

బాలీవుడ్ కింగ్​ ఖాన్​ షారుక్​(Shah Rukh Khan) చాలాకాలం తర్వాత చేస్తున్న చిత్రం 'పటాన్'(Pathan). కొవిడ్ రెండో ఉద్ధృతి తర్వాత ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. షారుక్​, జాన్ అబ్రహం ఇప్పటికే షూటింగ్​లో పాల్గొంటున్నారు. ఇప్పుడు దీపికా పదుకొణె(Deepika Padukone) రంగంలోకి దిగారు. తన పాత్రకు సంబంధించి కీలక సన్నివేశాలను, పాటను పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే విషయాన్ని దర్శకుడు సిద్ధార్థ్​ ఆనంద్​ వెల్లడించారు.

"అత్యంత ప్రతిభాశాలి దీపికకు స్వాగతం. షారుక్​, దీపిక జోడీ గురించి నేను కొత్తగా చెప్పాల్సిందేమి లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్​లో 'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్​ప్రెస్​', 'హ్యాపీ న్యూ ఇయర్' వంటి హ్యాట్రిక్ హిట్లు ఉన్నాయి. 'పటాన్'లోనూ వీరి జంట ప్రేక్షకులను అలరిస్తుంది."

- సిద్ధార్థ్​ ఆనంద్​, దర్శకుడు

ప్రస్తుత షెడ్యూల్ మరో 20 రోజులు సాగుతుందని, దీపికా అన్నిరోజులూ చిత్రీకరణలో పాల్గొంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి.

'పటాన్​' తర్వాత..

'పటాన్‌'(Pathan) సినిమా తర్వాత షారుక్​ ఖాన్‌ చేయనున్న సినిమా ఏంటి? దీనిపై ఎంతోకాలంగా చర్చ నడుస్తోంది. ఎంతోమంది దర్శకుల పేర్లు బయటికొచ్చాయి. అయితే ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో షారుఖ్‌ సినిమా ఖరారైందని బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. తమిళంలో 'తేరి', 'మెర్సిల్‌', 'బిగిల్‌' వంటి హిట్‌ చిత్రాలను అందించిన అట్లీ, షారుక్​ కలయికపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి.. షారుక్​ను కాపాడే పాత్రలో సల్మాన్!

Last Updated : Jul 5, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.