Deepika Padukone, NTR, AlluArjun: టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లుఅర్జున్, ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె. ఎన్టీఆర్ వ్యక్తిత్వం తనను ఆకట్టుకుందని తెలిపింది.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె గెహ్రాహియా చిత్రంతో ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ భామ తన మనసులోని ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. అల్లుఅర్జున్, ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఉన్నట్లు తెలిపింది. తారక్ వ్యక్తిత్వం, నటన తననెంతో ఆకట్టుకున్నాయని చెప్పింది. ఇప్పటికే ప్రభాస్‌తో కలిసి 'ప్రాజెక్ట్ కె' సినిమాలోనూ దీపిక నటిస్తోంది.
కాగా, బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మన హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే ఆలియా భట్, దీపికా పదుకొణె, అనన్య పాండే మన హీరోలతో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.
బన్నీతో నటించాలని ఉంది
అల్లుఅర్జున్‌తో కలిసి సినిమా ఎప్పుడు చేస్తావని తన ఇంట్లో వారు అడుగుతున్నారని ఇటీవల ఆలియా చెప్పింది! బన్నీతో కలిసి నటించాలని ఉందని పేర్కొంది. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఆలియా.. ఆయనతో కలిసి మరో మూవీ చేయనుంది. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు.
ఇదీ చూడండి: బోల్డ్ సీన్స్‌పై ట్రోల్స్.. నెటిజన్లపై దీపిక ఫైర్!