అందం, అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకునే తారల్లో దీపికా పదుకునే ఒకరు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఈ నటి తన ఫొటోలను అభిమానులకు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో దీపికా పోస్ట్ చేసిన ఓ ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది.
తెల్లటి టీ షర్టు, మెటాలిక్ ప్యాంటు ధరించి మెరిసిపోతోంది ఈ అమ్మడు. ఓ అంతర్జాతీయ వేడుకకు హాజరైన దీపికా సరికొత్తగా కనిపించి అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె వస్త్రధారణను ఉద్దేశిస్తూ.. తన భర్త రణవీర్ సింగ్ 'గుడ్.. సింధి.. బాహు' అంటూ కితాబిచ్చాడు. ప్రస్తుతం ఈ నటి కపిల్ దేవ్ బయెపిక్‌లో నటిస్తోంది.
ఇవీ చూడండి.. శేఖర్ లెక్కలు తేల్చే పనిలో రాజశేఖర్