భారతీయ చలన చిత్ర పితామహుడిగా పేరుగాంచిన దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్భంగా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ముంబయి, దిల్లీతో పాటు హైదరబాద్‌లోనూ ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
'భరత్ అనే నేను' చిత్రంలోని నటనకుగానూ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు మహేశ్ బాబు. ఉత్తమ నటిగా అనుష్క (భాగమతి), ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ (రంగస్థలం), ఉత్తమ చిత్రంగా 'రంగస్థలం' పురస్కారాలు కైవసం చేసుకున్నాయి. ఔట్ స్టాండింగ్ ఫర్ఫామెన్స్ అవార్డు కీర్తి సురేశ్ (మహానటి)కి దక్కింది.
ఇవీ చూడండి.. 'నన్ను పెళ్లి చేసుకోవడం అంత సలభమేం కాదు'