ETV Bharat / sitara

కిలిమంజారో పర్వతంపై సోనూసూద్​! - సోనూసూద్​పై ఉమా సింగ్​ అభిమానం

సోనూసూద్​పై అభిమానాన్ని చాటుకున్నారు దేశానికి చెందిన ఓ పర్వతారోహకుడు. ఎత్తయిన కిలిమంజారో పర్వతం పైకెక్కి సోనూ పోస్టర్​తో ఫొటోలు దిగారు. తన విజయం ఆయనకు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

ఎత్తయిన పర్వతంపై సోనూసూద్ పోస్టర్
ఎత్తయిన పర్వతంపై సోనూసూద్ పోస్టర్
author img

By

Published : Aug 18, 2021, 2:40 PM IST

ప్రముఖ నటుడు సోనూసూద్​కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తయిన పర్వతం కిలిమంజారో అధిరోహించిన పరత్వారోహకుడు ఉమా సింగ్.. తన విజయాన్ని సోనూకు అంకితమిస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా, సోనూసూద్ దానిని తన ఖాతాలో తిరిగి ట్వీట్ చేశారు.

  • 15th Aug.I was on top of Africa continent's highest mountain Mt. Kilimanjaro with a bicycle
    To salute the man who is already on top This victory is dedicated to the only real superhero @SonuSood sir
    Thank you sir for always being an inspiration
    Thanks @Sadhu_Baijnath for support pic.twitter.com/XIp0KS7817

    — Uma singh (cyclist and mountaineer) (@CyclistUma) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

యూపీ వాసి..

ఉత్తరప్రదేశ్​ గోరఖపుర్​కు చెందిన పర్వతారోహకుడు, సైక్లిస్ట్ ఉమాసింగ్.. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కిలిమంజారో శిఖరం తొలి బేస్ పాయింట్​ వరకు ఎక్కారు. అక్కడే నిలబడి సోనూసూద్​ పోస్టర్​ను చూపించారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం నిలబడ్డ సోనూసూద్​కు తన విజయాన్ని అంకితమిస్తున్నట్లు ఉమ తెలిపారు.

గతేడాది లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి అండగా నిలిచారు సోనూసూద్. ఇప్పటికీ ఎవరో ఒకరికి సాయం చేస్తూ, 'రియల్ హీరో' అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం సోనూ.. తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.