ETV Bharat / sitara

Pushpa 2 Movie: 'పుష్ప పార్ట్ 2'తో ఏం చెప్పబోతున్నారు? - అనసూయ

Pushpa 2 Movie: దేశవ్యాప్తంగా థియేటర్లలో 'పుష్ప'రాజ్ హవా కొనసాగుతోంది. ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తొలి భాగంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎదిగిన పుష్పరాజ్​ రెండో పార్ట్​లో ఏం చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. దాంతో పాటు మిగిలిన కీలక పాత్రలకు 'పుష్ప ది రూల్​' లో దర్శకుడు సుకుమార్ ఎలాంటి ముగింపు ఇస్తాడో అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Pushpa
పుష్ప
author img

By

Published : Dec 18, 2021, 12:41 PM IST

Pushpa 2 Movie: 'పుష్ప: ది రైజ్' విడుదలై మాస్‌లో మంచి టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ నటన, యాక్షన్‌ సన్నివేశాలకు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. దీనికి కొనసాగింపుగా 'పార్ట్‌-2' కూడా విడుదలవుతుందని బృందం ఇప్పటికే ప్రకటించింది. 'పుష్ప: ది రూల్‌'(Pushpa: The rule) టైటిల్‌తో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తొలి భాగంలో ఒక సాధారణ కూలీగా జీవితం మొదలు పెట్టిన పుష్పరాజ్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది అదిరిపోయేలా చూపించారు దర్శకుడు సుకుమార్‌. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే వదిలేశారు‌. దీంతో మలి భాగంలో ఏం చూపించబోతున్నారా? అన్న ఆసక్తి మొదలైంది! బహుశా ఇలా ఉండవచ్చు.

Pushpa
'పుష్ప'లో బన్నీ
  • ప్రేక్షకులను ఉత్కంఠతో ఎదురు చూసేలా బలమైన పాయింట్‌తో 'పుష్ప: ది రైజ్‌'కు ముగింపు ఇవ్వలేదు దర్శకుడు సుకుమార్‌. ఇలాంటి ప్రశ్నలు ఏవైనా వదిలేస్తే రెండో భాగంపై అంచనాలు పెరిగిపోతాయని అనుకుని ఉండవచ్చు.
  • 'పుష్ప: ది రూల్‌' చూడాలని వచ్చే ప్రేక్షకుడు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు రావాలని సుకుమార్‌ భావించి ఉండవచ్చు. ఎందుకంటే తనదైన మార్కు ట్విస్ట్‌లతో ప్రేక్షకులను అలరించడమే సుకుమార్‌ స్టైల్‌. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
  • పార్ట్‌-1లో మంగళం శ్రీనుగా ప్రతినాయకుడిగా పాత్రలో సునీల్‌ సరికొత్తగా కనిపించారు. రెండో భాగంలో ఈ పాత్రను మరింత క్రూరంగా చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా పుష్పరాజ్‌ను ఎదుర్కొనే దీటైన పాత్రగా మరోసారి సునీల్‌కు ఎలివేషన్‌ లభించవచ్చు.
    Pushpa
    'పుష్ప'లో సునీల్
  • 'రంగస్థలం'లో రంగమ్మత్తగా చెరగని ముద్రవేసిన అనసూయ ఇందులో ద్రాక్షాయణిగా కనిపించింది. పార్ట్‌-1లో ఈ పాత్రకు సంబంధించిన బలమైన నాటకీయత ఎక్కడా కనిపించలేదు. బహుశా 'పుష్ప: ది రూల్‌'లో కోసమే తొలి భాగంలో ఈ పాత్రకు ఎక్కువ స్కోప్‌ ఇవ్వలేదనుకుంటా.
    Pushpa
    అనసూయ
  • ఇక ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా ద్వితీయార్ధం ఆఖరులో ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర పరిచయమైంది. రెండో భాగంలోనూ ఇది కొనసాగనుంది. తొలి భాగంలో పుష్పరాజ్‌ నుంచి ఎదురైన అవమానానికి భన్వర్‌సింగ్‌ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్న దాన్ని పార్ట్‌-2లో చూపించనున్నారు. అది ఒంటరిగానా, లేదా మంగళం శ్రీను, ద్రాక్షాయణిలతో కలిశా? అన్నది ఆసక్తికరం.
    Pushpa
    'పుష్ప'లో ఫాహద్ ఫాజిల్
  • జాలీ రెడ్డిగా కనిపించిన కన్నడ నటుడు ధనుంజయ పాత్రను కూడా పార్ట్‌-1లో ముగించలేదు. అంటే పార్ట్‌-2 ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది.
  • ఎవరా మురుగన్‌? అతనేనా? సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు తొలిచేస్తున్న మరో ప్రశ్న మురుగన్‌. సినిమాలో ఆ పేరు ప్రస్తావన చాలాసార్లు వస్తుంది, ఓ సందర్భంలో మురుగన్‌ ఓ వ్యక్తి అనుమతి కోసం వెయిట్‌ చేసినట్లు చూపిస్తారు. పార్ట్‌-2 కోసమే సుక్కు ఆ కీలక వ్యక్తి పాత్రను పూర్తిగా రివీల్‌ చేయలేదనిపిస్తోంది. మరి ఆ కీలక పాత్రలో కనిపించేది ఎవరు? మంగళం శ్రీను, ద్రాక్షాయణి, భన్వర్‌ సింగ్‌ పాత్ర కన్నా బలమైందా?
  • 'పుష్ప'లో రష్మిక నటన అల్టిమేట్‌ అంటూ చిత్ర బృందం పొగడ్తలతో ముంచెత్తింది. అయితే, ఫస్ట్‌ పార్ట్‌లో పుష్పరాజ్‌ ప్రియురాలిగా మాత్రమే కనిపించింది. మరి 'ది రూల్‌'లో ఆమె కూడా ఏ మేరకు ఉంటుందో చూడాలి. అన్నట్లు సినిమా ప్రచారంలో ఆమె కూడా రెండో పార్టులోనే నా పాత్ర ఇంకా బలంగా ఉంటుంది అని చెప్పింది.
    Pushpa
    రష్మిక
  • తొలి భాగంలో ఉన్న విలన్స్‌ను రెండో భాగంలో చూపిస్తే అంతగా మజా ఉండదు. కాబట్టి రెండో పార్టుకి వచ్చేసరికి బలమైన విలన్‌ అవసరం. హీరోకు పోటీగా నిలబడే ఆ వ్యక్తి ఎవరు అనేదే ఇక్కడ ప్రశ్న. పోలీసు పాత్రలో ఫహాద్‌ ఫాజిల్‌ను పూర్తి స్థాయి విలన్‌గా చూపిస్తారని ఆశించలేం. ఆ ఇంకో పాత్ర... బన్నీలోని హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయిస్తుంది అని టాలీవుడ్‌ టాక్.
    Pushpa
    పుష్పరాజ్​గా అల్లు అర్జున్
  • తన తండ్రి ఎవరు అనే ప్రశ్న పుష్పరాజ్‌కి సినిమా అంతటా వినిపిస్తుంటుంది. దానికి సమాధానం నేరుగా చెప్పే సీన్లు సినిమాలో బాకీ. అవి రెండో పార్టులో ఉంటాయి. అజయ్‌ పాత్రకు కూడా పుష్పరాజ్‌ సరైన సమాధానం చెప్పాలి. అది కూడా 'ది రూల్‌'లోనే.
  • సుకుమార్‌ - దేవిశ్రీ ప్రసాద్‌ అంటే.. ఐటెమ్‌ సాంగ్‌ పక్కా అంటారు. తొలి పార్టులో ఆ బాధ్యత సమంత తీసుకుంది. ఇప్పుడు రెండో పార్టులో ఆ ప్రత్యేక గీతంలో ఎవరు ఆడిపాడతారో చూడాలి.
  • అపరాధభావం, పరాభవంతో టాస్క్‌ఫోర్స్‌ అధికారి గోవిందప్ప (శత్రు) ట్రాన్స్‌ఫర్‌ మీద వెళ్లిపోతాడు. తిరిగి రెండో పార్టులో ఏదో సందర్భంలో ఈ పాత్రను కూడా ఆశించొచ్చు. పుష్పరాజ్‌ ఎదిగే క్రమంలో 'నీకు ఇక్కడి ఇబ్బందులు తెలియవులే అప్పా' అనే డైలాగ్‌ ఉంటుంది. దీనిపై జస్టిఫికేషన్‌ తప్పక ఉంటుంది.

ఇవీ చూడండి:

Pushpa Public Talk: 'పుష్ప' సినిమా ఆడియెన్స్ టాక్ ఏంటంటే?

Pushpa Review: 'మాస్​ సినిమాకు సరికొత్త డెఫినిషన్​ 'పుష్ప''

pushpa review: రివ్యూ: పుష్ప- ది రైజ్.. బన్నీ-సుక్కు అదరగొట్టారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.